కృత్రిమ మేధస్సు
మనం ఇప్పుడు కృత్రిమ మేధస్సు యుగంలో ఉన్నామని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం లేచిన మొదలు పడుకున్నంత వరకు ఏదో ఒక రూపంలో మనం కృత్రిమ మేధస్సు కలిగి ఉన్న పరికరాలను ఉపయోగిస్తూ ఉంటాము. అందువల్ల కృత్రిమ మేధస్సు, అనేది మన శరీర భాగంలో ఒక భాగంగా మారిపోయింది.
TECHNOLOGY
gowri sankar
7/13/20251 నిమిషాలు చదవండి


కృత్రిమ మేధస్సు
ఈ ప్రపంచం ఇప్పుడు కృత్రిమ మేధస్సు లో జీవిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మానవుడు లేచిన మొదలు, పడుకునే అంతవరకు ఏదో ఒక రూపంలో కృత్రిమ మేధస్సు ను వినియోగిస్తూ ఉంటున్నారు. అయితే ఈ కృత్రిమ మేధస్సు, వలన మనకు చాలా విధంగా మన యొక్క పనులను చాలా త్వరగా ఎటువంటి సమయం వృధా కాకుండా మరియు ఎటువంటి ఒత్తిడి లేకుండా వారి యొక్క పనిని చాలా తక్కువ సమయంలో మనకు కావలసిన అవుట్ పుట్ ను తీసుకురావడంలో ఈ కృత్రిమ మేధస్సు మనకు నిరంతరం పనిచేస్తూ ఉంటుంది.
కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి?
"Artificial Intelligence" అనే పదం తొలిసారిగా 1956లో జాన్ మెకార్తీ అనే శాస్త్రవేత్త ఉపయోగించారు. అప్పటి నుంచి ఈ సాంకేతికత నిరంతరం అభివృద్ధి చెందుతూ మనిషి జీవితంలో సరికొత్త విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.
కృత్రిమ మేధస్సు అనేది కంప్యూటర్ యొక్క సాంకేతిక, మరియు ఇది యంత్రాల సహాయంతో పనిచేస్తుంది. ఇది మానవుడు వలె పోలి పనిచేస్తుంది . ఇది చాలా రకాలుగా పనిచేస్తుంది. ఎటువంటి కష్టమైన పని అయినా చేస్తుంది. దీని యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందంటే, చూడడం, చిత్రాలను గుర్తించడం,అర్థం చేసుకోవడం ,మాటలను అనువదించడం మరియు వివిధ రకాల భాషలను రాయడం. డేటాను విశ్లేషించడం ఈ విధంగా మానవుడు ఏ విధంగా పని చేస్తాడో, ఆ విధంగా పనిచేస్తుంది. అయితే ఇందులో ఎక్కువ మొత్తం డేటా ఉండటం వలన ఈ కృత్రిమ మేధస్సు అయినది మానవుల కంటే ఎక్కువ పని తిరు కనపరుస్తుంది.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ,ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించారు.
1. Narrow AI
2.General AI
3. Super AI
1. Narrow AI : ఇది ఒక నిర్దిష్టమైన పనిని చేయడంలో నిపుణత కలిగి ఉంటుంది. ఉదాహరణకు: వాయిస్ అసిస్టెంట్లు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్.
2.General AI: ఇది మనిషిలా అన్ని రకాల పనులను నేర్చుకుని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది
3. Super AI: ఇది మనిషి మేధస్సును మించి ఆలోచించగల యంత్ర మేధస్సు. ఇది భవిష్యత్తు దశలో పరిశోధనలో ఉన్న అంశం.
ఎలా పని చేస్తుంది?
యువత కృత్రిమ మేధస్సు పద్ధతిలో మారుతూ ఉన్నప్పటికీ ప్రధానమైనది మాత్రం డేటా చుట్టూ తిరుగుతూ ఏ ఏ వ్యవస్థలు పెద్ద మొత్తంలో డేటాను బహిర్గతం చేయడం ద్వారా నేర్చుకుంటాయి. మరియు మానవుల కోల్పోయే నమూనాలను మరియు సంబంధాలను కూడా గుర్తిస్తాయి.
కృత్రిమ మేధస్సు యొక్క హృదయం డేటా. మనం ఇంటర్నెట్‌లో ఇచ్చే సమాచారం, ఫోటోలు, వాయిస్ కమాండ్స్, వీడియోలు — ఇవన్నీ AI వ్యవస్థలకు నేర్చుకునే పదార్థంగా మారుతాయి.
AI వ్యవస్థలు Machine Learning (యంత్ర అభ్యాసం) మరియు Deep Learning (లోతైన అభ్యాసం) ద్వారా పనిచేస్తాయి. ఇవి పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించి, దాని నుండి నమూనాలను (patterns) గుర్తించి, భవిష్యత్ అంచనాలు వేస్తాయి.
ఉదాహరణకు, ఒక AI సిస్టమ్ పిల్లి చిత్రాలను గుర్తించాలంటే, అది వేల సంఖ్యలో పిల్లి ఫోటోలు చూడాలి. ఆ తర్వాత, ఏ లక్షణాలు పిల్లికి ప్రత్యేకమో నేర్చుకుంటుంది. ఇకపై కొత్త ఫోటో చూపించినా, అది పిల్లి అని గుర్తిస్తుంది.
కృత్రిమ మేధస్సు యొక్క ప్రయోజనాలు
1. ఆటోమేషన్
కృత్రిమ మేధస్సు అనేది వర్క్ ఫ్లోర్లు మరియు ప్రక్రియలను ఆటోమేటిక్ చేయగలదు లేదా మానవుల బృందం నుండి స్వతంత్రంగా మరియు స్వయంప్రతిపత్తిగా పనిచేయగలరు ఉదాహరణకు నెట్వర్క్ ట్రాఫిక్ ను నిరంతరం పర్యావేక్షించడం మరియు విశ్లేషించడం ద్వారా సైబర్ పద్ధతి యొక్క అంశాలను ఆటోమేటిక్గా చేయడంలో ఏఐ సహాయపడుతుంది అదేవిధంగా స్మార్ట్ ఫ్యాక్టరీ డజనల్ కొద్ది కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఫ్యాక్టరీలో తయారయ్యే ఉత్పత్తులు ఉంటాయి. అయితే అవి కొన్ని బాగా ఉంటాయి కొన్ని బాగుండవు చివరి దశలో వచ్చినప్పటికీ అప్పుడు ఏఐ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎలా అంటే ఆ ఉత్పత్తులను ది ఔట్పుట్ సరిగా వచ్చిందా లేదా అందులో లోపం ఉందా లోపాలను మరియు తనిఖీలు చేయడంలో చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఖచ్చితమైన సమయాన్ని విశ్లేషించడం లో రోబోట్లను ఉపయోగిస్తారు.
2. మానవ తప్పిదలను తగ్గించడం
కృత్రిమ మేదస్సులో ఒకే రకమైన ప్రోగ్రాం మరియు పద్ధతులను అనుసరించడం వలన తయారీలో తయారు పద్ధతులు ఎటువంటి లోపాలు ఉన్న సులభంగా గుర్తించడం అదేవిధంగా అసెంబ్లీ చేయవలసిన వస్తువులు మరియు ఇతర పనులను ఉన్న లోపాలను సులభంగా గుర్తించి వాటిని తొలగిస్తుంది.
3. పునరావృత పనులను తొలగించడం.
పునరావృత పనిలో నిర్వహించడం కృత్రిమ మేధస్సు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా అధిక ప్రభావ సమస్యలపై పనిచేస్తుంది. పత్రాలను పత్రాలు ధ్రువీకరించడం ఫోన్ ఫోన్ కాల్స్ కస్టమర్ సేవల కోసం ఆటోమేటిక్గా ఉంచడంలో ఉపయోగిస్తారు. తరచుగా రోబోట్లను మానవ స్థానంలో మందమైన మురికి మరియు ప్రమాదకరమైన పనులను చేయడానికి ఉపయోగిస్తారు.
4. వేగం మరియు ఖచ్చితత్వం
కృత్రిమ మేధస్సు అనేది మానవుల కంటే చాలా వేగంగా ఏ పని ఇచ్చినా చేస్తుంది మరియు చాలా ఖచ్చితమైన అవుట్ పుట్ ను కనపరిస్తుంది.అదే విధంగా మానవులు చేయలేని డేటా నమూనా కొనుక్కొని సంబంధాలు కొనసాగించగలదు.
5. అనంతమైన లభ్యత
కృత్రిమ మేధస్ అనేది రోజు, సమయం, విరామం లేకుండా పనిచేస్తుంది. మానవుడు యొక్క రకరకాలు బారాలు మరియు బాధ్యతలు వలన కొన్ని కొంతవరకు పరిమితమై ఉంటారు అదే కృత్రిమ మేధస్సు అయితే క్లౌడ్ వల్ల నడుస్తుంది కాబట్టి ఈ కృత్రిమ మేధస్సు మరియు మిషన్ లైనింగ్ ఎల్లప్పుడు ఆన్లో ఉంటాయి. అందువలన ఎటువంటి అలసత్వం లేకుండా వాటికి కేటాయించిన పనిని నిరంతరం పనిచేస్తూ ఉంటుంది.
6. వేగవంతమైన పరిశోధన మరియు అభివృద్ధి
అపారమైన డేటా సంపద ఉండటం వలన త్వరగా విశ్లేషించడం, సామర్థ్యం వంటి ఉండటం వలన పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో చాలా వేగవంతమైన పురోగతిని దారితీస్తుంది. ఉదాహరణకు మానవులు జంతువులను లెక్కించడం , కృత్రిమ మేధస్సును ఉపయోగించబడుతుంది.
అప్లికేషన్స్ మరియు ఉపయోగాలు
ఈ కృత్రిమ మేధస్సు అనేది చాలా రంగాల్లో చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు.
1. మాటలను గుర్తించడం
ఉదాహరణకు ఆపిల్ అలెక్స ఉంది కదా అది మనం ఏ విధంగా ప్రశ్న అడిగితే ఆ విధంగా సమాధానం చెబుతుంది.
2. చిత్రాలను గుర్తించడం
మానవుడికి చాలా చిత్రాలను గుర్తించడంలో చాలా కష్టమైపోతుంది, అదేవిధంగా కృత్రిమ మేధస్సును ఉపయోగించి చాలా సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది.
3. అనువదించడం
ఈ ప్రపంచం నాకు చాలా భాషలు ఉంటాయి అవి మానవుల కైతే చాలా కష్టం అవుతుంది అనువదించడం ఈ కృత్రిమ మేధస్సు ను ఉపయోగించి చాలా సులభంగా అనువదించవచ్చు.
4. ముందుగా చెప్పే నమూనా
సామాన్యంగా వర్షాలు ఎప్పుడు వస్తాయి,ఎప్పుడు రావు అనే విషయం గురించి మనం ముందుగా గుర్తించడంలో ఈ యొక్క కృత్రిమ మేదస్సు చాలా ఉపయోగపడుతుంది.
5. డేటా అనాలటిక్
ఒక చాలా పెద్ద మొత్తంలో ఉన్న డేటాను చాలా సులభంగా ధ్రువీకరించి వాటి యొక్క లోపాలను సరి చేయడం మరియు క్షుణ్ణంగా విశ్లేషించడం అధ్యయనం చేయడం వంటి పనుల్లో చాలా బాగా ఉపయోగిస్తారు.
6. సైబర్ సెక్యూరిటీ
మనం సైబర్ దాడులు తరచుగా చూస్తూ ఉంటాం. సైబర్ నేరగాళ్లు మన అకౌంట్ నుంచి డబ్బులు దొంగలించారని మనం వింటూ ఉంటాం. అయితే అటువంటి ముప్పును నుంచి మానవులను రక్షించడం కోసం ఈ యొక్క సైబర్ సిస్టం కు ఎటువంటి దాడి లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ మనకు భద్రతను కల్పించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.
7. వ్యవసాయ రంగంలో
ఈ టెక్నాలజీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే వ్యవసాయ రంగంలో చాలా సహాయపడుతుంది. ఎందుకంటే మనం సాధారణంగా రైతులు పంటలు పండించేటప్పుడు చాలా ఇబ్బందులు అయితే వాళ్ళు ఎదుర్కొంటారు. వాతావరణంలో జరుగుతున్న మార్పుల వలన వాళ్ళు చాలా రకాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు ఎలా అంటే వర్షాలు పడడం, లేదా వర్షాలు పడకపోవడం పంట్లు పండించే నేల యొక్క స్వభావం గురించి సరిగా గుర్తించకపోవడం ఇలా చాలా రకాలు ఇబ్బందులు అయితే వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా మనం ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని, చాలా సులభంగా మనం రైతులకు పంటలు ఏ కాలంలో ఏ పంటలు వెయ్యాలి, ఏ టైం లో వాతావరణం ఎలా ఉంటుంది.వర్షాలు ఎప్పుడు పడతాయి, భూమి యొక్క సాంద్రత ఎలా ఉంటుంది. ఇవన్నీ మనకు ముందుగా డేటా అయితే ఇస్తుంది. అదేవిధంగా మనం పంట వేసిన తర్వాత దానికి కావలసిన ఎరువులు ఎలాంటప్పుడు వెయ్యాలి, అని మనకు ఒక బేటా రూపంలో మనకైతే సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన మొబైల్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం పంటని జాగ్రత్తగా పండించడం అదేవిధంగా మనం పూర్తిస్థాయిలో ఆ పంటను మనకు చేతికి వచ్చే విధంగా ఎటువంటి నష్టం లేకుండా మనం ముందుగా గ్రహించుకొని మన పంటని మనం పండించుకోవచ్చు.
AI సవాళ్లు మరియు నైతిక అంశాలు
కృత్రిమ మేధస్సు మన జీవితాన్ని సులభతరం చేస్తూనే, కొన్ని సమస్యలను కూడా సృష్టిస్తోంది.
1.ఉద్యోగ నష్టం
ఆటోమేషన్ వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒక సరికొత్త టెక్నాలజీని రావడం జరుగుతుంది. ఆ క్రమంలో మనం ఆ టెక్నాలజీకి అనుకూలంగా మనం మార్చుకుంటూ ముందుకు వెళ్తాం. అయితే ఇప్పుడు ఏఐ రావడం వలన కూడా ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా మన యొక్క కార్యక్రమాలను నిర్వహించడానికి అనుకున్న పనిని చాలా సులభతరంగా చేసుకోవడానికి ఇలా చాలా రకాలుగా మనం చేసుకోవడానికి మనం ఈ కొత్త టెక్నాలజీని మనం వినియోగించడం ప్రారంభిస్తాం.ఈ క్రమంలో మనం ముందు వినియోగించిన టెక్నాలన్నీ మనం అప్డేట్ చేసుకోను చేసుకుంటూ కొత్త టెక్నాలజీస్ కు మార్చుకుంటాం.అయితే ఆ క్రమంలో కొన్ని కీలక పరిణామాలు జరుగుతాయి, అందువల్ల కొన్ని కంపెనీలకి కావలసిన టెక్నాలజీని స్వీకరించిన వలన కొన్ని కంపెనీల్లో జాబులని తీయడం జరుగుతుంది. అందువల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న దిగ్గజ కంపెనీలో ఉన్న పని చేస్తున్న ఉద్యోగస్తులను చాలా పెద్ద సంఖ్యలో వారిని విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. ఇది మనం తరుచుగా చూస్తున్న ,జరుగుతున్న విషయాలు.
2.డేటా గోప్యత
మన వ్యక్తిగత సమాచారం సేకరించబడుతుండటంతో గోప్యతా సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలం సోషల్ మీడియాని చాలా వేగంగా జనాల్లోకి వెళ్తుంది. వాళ్లు ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్లు చేయడం జరుగుతుంది .అయితే ఈ విషయాల్లో ఇప్పుడు ఏఐ అనేది సమగ్రత అవడం వలన మనం ఏవైతే కొన్ని విషయాలను కీలకమైన విషయాలను మన యొక్క వ్యక్తిగత డేటా రూపంలో ఇతరులు అయినా చెడ్డవాళ్లు చేతుల మీద పడితే మన యొక్క డేటా వాళ్లు అపహరించుకొని మన డేటా తో వాళ్ళు ఏమైనా చేస్తారని, ఒక ఆందోళన అయితే ఉంది.
3.భ్రాంతి నిర్ణయాలు (Bias)
AI సిస్టమ్‌కు ఇచ్చే డేటాలో పక్షపాతం ఉంటే, నిర్ణయాలు తప్పుగా ఉండవచ్చు. ఎంత టెక్నాలైనా కొన్నిసార్లు తప్పులు అయితే చేయడం జరిగింది.అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ టెక్నాలజీని వినియోగించుకున్న తర్వాత అది నిజమో కాదనేది, మనము తరుచుగా చెక్ చేసుకోవాలి.
ముగింపు
ఈ కృత్రిమ మేధస్సు టెక్నాలజీని వలన మన యొక్క పనులను చాలా సులభంగా మరియు వేగంగా చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని ఆందోళనలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మన వ్యక్తిగత డేటాను చోరీ చేసి, మనకి భంగం కలిగిస్తారని, ఒక ఆందోళన అయితే జనాల్లో ఉంది. ఇటువంటి ఆందోళన లేకుండా డేటాన్ని చాలా పకడ్బందీగా రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఇటువంటి టెక్నాలజీని ముఖ్యంగా మంచి కోసం వినియోగించుకోవాలి. ఈ టెక్నాలజీని మనం మరింత అవగాహన చేసుకుని ముందుకు తీసుకువెళ్లాలి.
