కో- పైలట్ ఫంక్షన్

మైక్రోసాఫ్ట్ వారు ఎక్సెల్ షీట్ లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది అది ఏదంటే ఎక్సెల్ షీట్లో కొత్తగా ఒక ఫంక్షన్ యాడ్ చేయడం జరిగింది ఆ ఫంక్షన్ ఏమిటంటే కో- పైలట్ ఫంక్షన్ ఇది పూర్తిస్థాయి ఏఐ ఆధారిత కలిగిన ఫంక్షన్ ఇది చాలా ఈజీగా ఎక్సెల్లో మన యొక్క పనిని చేస్తుంది.

AI REVOLUTION

Gowrisankar

8/25/20251 నిమిషాలు చదవండి

కో- పైలట్ ఫంక్షన్

ప్రస్తుతం మనమందరం ఏఐ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎందుకంటే మనం ప్రత పని కి మనం ఏఐ మీద ఆధారపడి ఉంటున్నాం .ఎందుకంటే మన ప్రపంచానికి ఏఐ అనేది సరికొత్త విప్లవంగా మారింది ఇది అన్ని రంగాల్లో విస్తృత స్థాయిలో విస్తరించడం జరిగింది. ప్రతి రంగంలో గవర్నమెంట్ రంగంలో గాని ఇండస్ట్రీ రంగంలో గాని ,సాఫ్ట్వేర్ రంగంలో గాని ఎడ్యుకేషన్ రంగంలో గాని ,ఇలా అన్ని రంగాల్లో ఏఐను మనం నిరంతరం మనకు అవసరం తగ్గట్టుగా ఉపయోగిస్తున్నాం. అందువల్ల మనం ఇప్పుడు AI యుగంలో ఉన్నాం.

ఇప్పుడు కొత్తగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో చాలా భారీ మార్పులను తీసుకురావడం జరిగింది. ఎక్సెల్ లోకి ఏఐ ఆధారిత కలిగిన కో- పైలట్ ఫంక్షన్ ను తీసుకు రావడం జరిగింది.

ఎక్సెల్ అంటే ఏమిటి?

ఎక్సెల్ అనేది వివిధ రంగాల్లో తరచుగా ఉపయోగించే ఒక బహుముఖ స్ప్రెడ్‌షీట్ అప్లికేషన్.

మనం సాధారణంగా ఎక్సెల్ అన్నది చాలా రంగాల్లో తరుచుగా ఉపయోగించి ఒక అప్లికేషన్ అయితే ఎక్సెల్ ను ఉపయోగించిన వాళ్ళ మన యొక్క అవసరాలను మనకి కావాల్సిన వాటికోసం ఉపయోగిస్తున్నం అయితే ఎక్సెల్ అనేది చాలా రంగాల్లో ఉపయోగిస్తారు ఉదాహరణకు మనం ఎడ్యుకేషన్ రంగం గురించి తీసుకుంటే ఎడ్యుకేషన్ రంగంలో మనం స్టూడెంట్స్ కి యొక్క అటెండెన్స్ లిస్ట్ తయారు చేయాలనుకుంటే మనం ఈ ఎక్సెల్ షీట్ ని మనం ఉపయోగించి వాళ్ళ యొక్క అటెండెన్స్ లిస్టును మనము తయారు చేస్తాం ఇది తయారు చేసే విధానం ఎలా ఉంటుందంటే మనం సంప్రదాయ పద్ధతుల్లో అయితే ఈ ఎక్సెల్ షీట్ లో అయితే మనం ఫార్ములా ఉపయోగించి చేస్తాం .అక్కడ ఫార్ములా మనం సరిగ్గా వ్రాయ లేకపోయినా ఏ బ్రాకెట్లైనా, కోలం అయినా కామా అయినా, ఇలా ఇలా మిస్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సింటెక్స్ ఎర్రర్ అంటారు. ఎవరికైనా కోలం ఎర్రర్ వచ్చిందనుకో మనం చాలా ఇబ్బంది పడి చాలా కష్టంగా మనం ఆ యొక్క పనిని పూర్తిచేస్తాం. అందువల్ల మనకు చాలా ఆలస్యం అవుతుంది మన యొక్క పని. ఈ యొక్క స్టూడెంట్స్ లిస్టు తయారు చేస్తాం. ఇలా తయారు చేయడం వల్ల మనకు చాలా సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా సమయం అనేది మనకు వృధా అవుతుంది.

ఉదాహరణకు ఒక రెస్టారెంట్ గురించి చూస్తే ఆ రెస్టారెంట్లో బిల్ కలెక్షన్ సెంటర్ ఉంటుంది అక్కడ ఎక్సెలను ఉపయోగిస్తారు ఎందుకంటే వచ్చిన విజిటర్స్ కోసం వారి యొక్క బిల్లును ఇవ్వడానికి అదేవిధంగా ఎంత మొత్తంలో ఆర్డర్ చేసుకుని తిన్నారు.ఇలా చాలా పెద్ద డేటా ఉంటుంది. ఆ డేటాను ఎనాలసిస్ చేయడానికి మనం రెస్టారెంట్లో సిస్టంలో ఈ. ఎక్సెల్ ను ఉపయోగిస్తారు అందువల్ల వాళ్లకి ఈ ఎక్సెల్ ద్వారా వాళ్ళు ఎవరైతే తిన్నారో వారి యొక్క బిల్లును లెక్క కట్టి వాళ్లకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మాన్యువల్ కంట ఈ ఎక్సెల్ ని ఉపయోగించి చేసుకోవడం వలన మన యొక్క పని ఈజీ అవుతుంది. అందువల్ల ఎక్సెల్ ను తరచుగా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మైక్రోసాఫ్ట్ వారు ఎక్సెల్ లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూస్తే

మైక్రోసాఫ్ట్ వారు ఎక్సెల్ లో కొన్ని మార్పులు తీసుకు రావడం జరిగింది అవి ఎలా అంటే ఫార్ములాలో కొన్ని మార్పులను చేయడం జరిగింది. ఏఐ ఆధారిత అయిన కో పైలట్ ఫంక్షన్ ఇప్పుడు అందులో ఉంచడం జరిగింది.

ఈ కో- పైలెట్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందంటే.

ఎక్సెల్ ఈ కో పైలట్ ఫంక్షన్ యాడ్ చేయడం వలన మనకు మన యొక్క పని చాలా సులభంగా అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ని సపరేట్ చేయాలనుకో ఎక్సెల్ లో మనం సాంప్రదాయ పద్ధతులు అయితే మనం చాలా టైం తీసుకుని మనం ఈ స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ని మనం సపరేట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ కో- హైలెట్ ను ఉపయోగించుకొని చాలా సులభంగా మనం స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ని చాలా త్వరగా మనం సపరేట్ చేయవచ్చు. ఎలా చేస్తారంటే ఇప్పుడు ఈ కో -ఫైలెట్ ఫంక్షన్ ను ఉపయోగించుకొని మనం ఏమి లేదు జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చామనుకో కో- హైలెట్ అనే ప్రాంప్ట్ మనం ఇస్తే చాలు ఎలా ఇవ్వాలంటే స్టూడెంట్స్ నేమ్స్ సెపరేట్ చేయండి అని ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాం అనుకో వెంటనే మనం అడిగిన స్టూడెంట్స్ నేమ్స్ ని సపరేట్ చేసి మనకి కాలమ్స్ లో ఈ యొక్క ఎక్సెల్ షీట్ లో మనకు చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా మనకు ఇస్తుంది.

మనం సాధారణంగా ఎక్సెల్ అనేది చాలా రంగాల్లో మనం తలుచుగా ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఏ ఏ రంగాల్లో మన ఏ విధంగా ఈ ఎక్సెల్ ను ఉపయోగిస్తున్నాం చూద్దాం.

ఎక్సెల్లో కో- పైలట్ ఫంక్షన్ ఎలా ఉపయోగిస్తాం.

కాఫీ మిషన్ యొక్క ఫీడ్ బ్యాక్ గురించి మనం ఎక్సెల్ లో తెలుసుకుంటే.

ఇప్పుడు మనం స్ప్రెడ్షీట్ తీసుకొని కాపీ మిషన్ యొక్క ఫీడ్ బ్యాక్ సమ్మరైజ్ తెలుసుకోవాలనుకో మనం జస్ట్ చిన్న ప్రాంప్ట్ చాలు ఎలా అంటే.

" = COPILOT (" సమ్మరైజ్ కాఫీ మిషన్ యొక్క ఫీడ్ బ్యాక్ ను ఒక పేరాగ్రాఫ్ రూపంలో B1:B6 ఇవ్వండి" ).

అని మనం ప్రాంప్ట్ ఇచ్చామనుకో, మనకు వెంటనే ఆ ఫీడ్ బ్యాక్ అనేది ఈ విధంగా మనకు లెక్క కట్టి ఒక మనకు గ్రిడ్ రూపంలో ఇస్తుంది. ఆ కాఫీ మిషన్ యొక్క ఫీడ్ బ్యాక్ ఎలా ఇస్తుంది అంటే ఇది కొంచెం శబ్ద చేస్తుంది, కాబట్టి దీనికి కొంచెం మెయింటెనెన్స్ చేయవలసి ఉంది అని మనకి ఫీడ్బ్యాక్ అన్నది ఇస్తుంది. ఇంకా లోతుగా వెళ్లి మనం ఆ ఫీడ్బ్యాక్ ను క్యాటగిరీ చేయండి అని ఒక ప్రాంప్ట్ విధంగా

"=COPILOT(" ఆ కాఫీ మిషన్ యొక్క ఫీడ్బ్యాక్ ను B1:B6 క్యాటగిరి చేయండి" ).

అని ఇలా చెప్పమనుకో వెంటనే మనకు ఈ విధంగా కావలసిన క్యాటగిరీషను చేసి ఇస్తుంది. ఈ యొక్క కో-ఫైలేట్ ఫంక్షన్ చాలా అద్భుతంగా దాని యొక్క పని మనకి కనపరుస్తుంది. అందువల్ల ఈ కో ఫైలెట్ ఫంక్షన్ ఉన్నది చాలా గొప్పదని మనం చెప్పుకోవచ్చు.

1. రోడ్ ట్రిప్ ప్లానర్

ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ లో మనం రోడ్ ట్రిప్ ప్లానర్ గురించి కావాలంటే ఈ విధంగా ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే

=COPILOT (" PLEASE CREATE AN ITINERARY FOR A ROAD TRIP BASED ON THE STOPS AND NUMBER OF DAYS IN THIS TABLE B1:B6")

ఈ విధంగా ప్రాంప్ట్ మనం స్ప్రెడ్ షీట్ ఇచ్చామనుకో ఏడు రోజులు ప్లాన్ ఇస్తుంది అదేవిధంగా మనకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ గురించి మరియు అక్కడ లభించే ఫుడ్ గురించి మనకు చాలా చక్కనైన సమాధానాన్ని ఇస్తుంది.

2. బ్యాంక్ స్టేట్మెంట్స్

మనకి బ్యాంక్ స్టేట్మెంట్లు కావాలనుకో అందులోనూ వాటి యొక్క కేటగిరి చేసి కావాలంటే మనం ఎక్సెల్ లో ఈ విధంగా ఈ కో ఫైలెట్ ను ఉపయోగించి చేస్తే ఈ విధంగా మనకు సమాధానం వస్తుంది.

3. సీటింగ్ ప్లానింగ్

మనం సిటింగ్ ప్లానింగ్ కోసం మనం ఎక్సెల్ స్పెసిట్లో మనం తయారు చేయాలనుకుంటే మన కాలమ్స్ లో వెళ్లి ఈ కో పైలట్ అనే ఫంక్షన్ ని ఉపయోగించవనుకో మనం కావలసిన సిటింగ్ అరేంజ్మెంట్స్ ప్లానింగ్ మనకు చాలా త్వరగా ఇస్తుంది.

కో-ఫైలెట్ ఫంక్షన్ చాలా అద్భుతంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది సాంప్రదాయ పద్ధతిలో చేసిన ఫార్ములా కన్నా ఇది చాలా సులభంగా మన యొక్క కావలసిన పనిని చాలా తక్కువ సమయంలో మనకు అందిస్తుంది.

మీల్ ప్లానర్ ,డేటా ఎనాలసిస్ ,సెంటిమెంట్ అనాలసిస్ ,కష్టమైజేషన్ ఈ మెయిల్స్ ,అడ్రస్ క్లీనప్. ఇలా చాలా రంగాల్లో మనకు ఈ ఎక్సెల్ షీట్ లో, ఈ కో ఫైలెట్ ఫంక్షన్ను ఉపయోగించి మనం చాలా ఈజీగా మన యొక్క పనిని చేసుకోవచ్చు.

ముగింపు.

ఇలా చాలా రంగాల్లో ఎక్సెల్ షీట్ ను ఉపయోగించుకొని మన యొక్క పనిని చేసుకోవడానికి చాలా తరుచుగా ఉపయోగిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ యొక్క ఎక్సెల్ షీట్ లో కొత్తగా యాడ్ చేసిన కో పైలట్ ఫంక్షన్ వల్ల ఇంకా మన యొక్క పని అనేది ఈజీగా మారుతుంది.