నానో బనానా

నానో బనానా, ఇది ఒక అద్భుతమైన మనం ఎన్నడు కనివిని, ఎరగని ఏఐ ఇమేజ్ ఎడిటింగ్.

AI REVOLUTION

gowri sankar

8/30/20251 నిమిషాలు చదవండి

నానో బనానా

నానో బనానా, ఇది ఒక అద్భుతమైన మనం ఎన్నడు కనివిని, ఎరగని ఏఐ ఇమేజ్ ఎడిటింగ్.

ప్రస్తుత కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తుంది‌.ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు గూగుల్ జెమినై 2.5 ఫ్లాష్ లో కొత్తగా ఒక మోడల్ తీసుకువచ్చింది. ఆ మోడల్ పేరు నానో బనానా ఇది చాలా అద్భుతమైన ఇమేజ్ ఎడిటింగ్ మోడల్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.మనం ఇంతకుముందు కనివిని ఎరగని రీతిలో మనకు కావలసిన విధంగా ఆ ఇమేజ్ ని ఎడిటింగ్ చేసి అందిస్తుంది.

మనం సాధారణంగా ఏదైనా ఒక ఇమేజ్ ని ఎడిటింగ్ చేయాలంటే సాంప్రదాయ పద్ధతిలో మనం చేస్తూ ఉంటాం. ఆ సాంప్రదాయ పద్ధతిలో చాలా సమయాన్ని మనం తీసుకోవలసి వస్తుంది ఒక ఇమేజ్ ని మనకు కావాల్సిన రీతిలో ఎడిటింగ్ చేయాలంటే ఉదాహరణకు ఒక ఇమేజె ని తీసుకొని మనం బ్యాగ్రౌండ్ చేంజ్ చేయాలంటే ఒక సాంప్రదాయం పద్ధతిలో అయితే చాలా సమయం తీసుకుంటుంది అదేవిధంగా దానిలోను ఎటువంటి మార్పులు గాని కలర్ గ్రేడింగ్ గాని ఇలా చాలా రకాలు మనకు ఏ విధంగా మనం ఆలోచిస్తామో ఆ ఇమేజ్ కావాలని అలా రాడానికి చాలా సమయం పడుతుంది. అయితే సాంప్రదాయం మెథడ్ ని బ్రేక్ చేస్తూ కొత్తగా మనకు చాలా ఏఐ మోడల్స్ ఏఐ ఎడిటింగ్ యాప్స్, వెబ్సైట్లు మనకు అందుబాటులో వచ్చాయి. అయితే అది కూడా కొంచెం డ్రాగన్ అండ్ డ్రాప్ అనే మనం చేసుకోవాల్సి వస్తుంది. మనకు కావలసిన ఇమేజ్ రూపం రావాలంటే కొంత సమయం పడుతుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా గూగుల్ "నానో బనానా ఏఐ" ఇమేజ్ ఎడిటింగ్ తీసుకురావడం జరిగింది. ఇది జెమినైలో 2.5 ఫ్లాష్ లో ఉంటుంది.

నానో బనానా ఎలా పనిచేస్తుంది.

ముందుగా మనం గూగుల్ ఏఐ స్టేడియంలోకి వెళ్లి అందులో మనం నానో బనానా గురించి చూస్తే అక్కడ జెమినై 2.5 ఫ్లాష్ మోడల్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అందులోకి వెళ్లిన తర్వాత మనకి ఒక ఇమేజ్ ని తీసుకున్నావ్ అనుకో ఆ ఇమేజ్ ఎడిటింగ్ ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చావ్ అనుకో మనకు కావలసిన ఔట్పుట్ను ఇస్తుంది.

1. ఇమేజ్ బ్యాక్ గ్రౌండ్ చేంజ్.

మన ఒక ఇమేజిని తీసుకోను ఆ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలని జస్ట్ మనం ప్రాంప్ట్ చాలు మనకు ఏ బ్యాగ్రౌండ్ కావాలి ఉదాహరణకు ఆ ఇమేజ్ కి హిల్ ఏరియా కావాలనుకో వెంటనే మనం ప్రాంప్ట్ ఇచ్చాం అనుకో ఆ హిల్ ఏరియా బ్యాక్ గ్రౌండ్ మనకు చాలా అద్భుతంగా మనం ఎన్నడు చూడని విధంగా చాలా హై క్వాలిటీ గా మనకు ఆ యొక్క ఇమేజ్కి బ్యాక్ గ్రౌండ్ ఇవ్వబడుతుంది. ఎందుకు ఇంతకుముందు కూడా బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడానికి చాలా ఏఐ లు వచ్చాయి కదా అని అంటే దీనిలో ఏంటి ప్రత్యేకం అంటే ఇది చాలా బాగుంటుంది. జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు మనకి కావలసిన బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేసి మనకి అవుట్ ఫుట్ ని ఇస్తుంది.

2. చాలా రకాలుగా ఇమేజ్ని ఎడిటింగ్.

మనం సాధారణంగా ఒక ఇమేజ్ ని ఎడిటింగ్ చేయడానికి చాలా రకాలుగా మనం ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ చేంజ్ చేయడానికి మనం ఎక్కువగా ఎడిటింగ్ ని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఈ నానో బనానా ఇమేజ్ ఎడిటింగ్ అనేది చాలా అద్భుతంగా మనం నమ్మలేని విధంగా దాని యొక్క ఎడిటింగ్ పనితనాన్ని మనకి అందిస్తుంది. ఆ అద్భుతం ఏమిటంటే మనం ఒక వ్యక్తి ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ఉన్న ఆ వ్యక్తి యొక్క వాచ్ ని మనం రిమూవ్ చేయాలంటే సాంప్రదాయ పద్ధతిలో చాలా కష్టపడవలసి వస్తుంది. అదే ఇప్పుడు లేటెస్ట్ గా గూగుల్ తీసుకొచ్చిన జెమిని 2.5 ఫ్లాష్ లో ఉన్న నానోబనాలను ఉపయోగించే చేస్తే ఆ వాచ్ ను ఆ హ్యాండ్స్ ఉన్న దాన్ని జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఆ వాచ్ ని రిమూవ్ చేయండి ఆ హ్యాండ్స్ నుంచే అంటే చాలు వెంటనే ఆ ఇమేజ్ చాలా అద్భుతంగా ఎటువంటి లోపం లేకుండా ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉందో అలా మనకు చాలా హై క్వాలిటీ గా ఇమేజ్ ని ఎడిటింగ్ చేసి ఇస్తుంది. అదేవిధంగా ఆ వ్యక్తి వేసుకున్న షర్ట్ ని రిమూవ్ చేసి ఒక జాకెట్ వేసుకునే విధంగా మనం ఇమేజ్ ని ఆడ్ చేసి ఇస్తే వెంటనే రిమూవ్ చేసి ఆ జాకెట్ వేసుకున్నట్టు మనకు ఇమేజ్ అనేది ఇస్తుంది.

ఒక ఇమేజ్ లో ఉన్న వ్యక్తి 1980 కాలము నాటి ఆ వ్యక్తి యొక్క హెయిర్ స్టైల్ మార్చి ఇవ్వండి అని మనం ప్రాంప్ట్ ఇచ్చామనుకో ఆ వ్యక్తిని చాలా అద్భుతంగా మనకి 1980 కాలంలో ఎటువంటి హెయిర్ స్టైల్స్ ఉండేవో ఆ హెయిర్ స్టైల్ ను మనకు ఎటువంటి లోపం లేకుండా మనం ఏదైతే మొదటి అప్లోడ్ చేసాము ఆ ఫోటోకి మనకు చాలా అద్భుతంగా ఇస్తుంది.

ఒక ఇమేజ్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకో ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఇంకొక వ్యక్తి నిలిచిన ఇమేజ్లో మనం ఒక వ్యక్తి యొక్క ముఖాన్ని మార్చాలి అనుకో జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చావ్ అనుకో మనకి కావాల్సిన వ్యక్తి ఫేస్ ని పెట్టి మనకి ఒక చక్కనైన ఎటువంటి లోపం లేకుండా హై క్వాలిటీతో మనకు ఆ ఇమేజ్ను ఇస్తుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి ఇమేజ్ తీసుకున్నామనుకో ఆ వ్యక్తి కూర్చొని వున్నాడు ఆ ఇమేజ్ లో అయితే మనం ఇంకొంచెం ఎడిటింగ్ చేయాలనుకో వేరే వ్యక్తిని అతను వెనకాతల నిలిచొని అతను భుజాల మీద రెండు చేతులు వేసి నిలిచినట్టు మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకో వెంటనే అది మనం ఏదైతే అడిగామో ఆ వ్యక్తి ఇమేజ్ ఆ విధంగా రెండు చేతులు తన భుజాల మీద వేసిన ఇంకో వ్యక్తి నిలబడి ఉన్నట్టు మనకు ఆ ఇమేజ్ను అందిస్తుంది. ఈ ఎడిటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతకుముందు మనం నమ్మలేని రీతిలో ఉంటుంది.

3. థంబ్‌నెయిల్స్

మనం ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టపడి వలసి వస్తుంది. ఎలా అంటే ఏఐ ఆప్స్, అదేవిధంగా వెబ్సైట్స్ ఉన్న మనం చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే డ్రాగన్ అండ్ డ్రాప్ చేసి చాలా ఎలిమెంట్స్ తీసుకొని మనకు కావలసిన విధంగా ఆ ఎలిమెంట్స్ తో మనం ఇంటిగ్రేట్ చేసి మన యొక్క కావలసిన చేయడానికి చాలా కష్టపడి వలసి వస్తుంది. అదే విధంగా సమయం కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు google లేటెస్ట్ గా ఒక మోడల్ తీసుకొచ్చింది ఆ మోడల్ 2.5 ఫ్లాష్ మోడల్ ఇది జస్ట్ మనం చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు నాకు ఒక ఇమేజ్ ని ఆడ్ చేసి ఆ ఇమేజ్ ని యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఒక మొబైల్ గురించి ప్రాంప్ట్ ఇస్తే చాలు వెంటనే మనకు కావలసిన థంబ్‌నెయిల్ చాలా సెకండ్ లో మనకు అందిస్తుంది.

4. బిజినెస్ యాడ్స్

జనరల్గా మనం బిజినెస్ యాడ్ చాలా చూస్తాం ఉదాహరణకు మొబైల్స్ యాడ్స్ గురించి చూస్తే మనం చాలా సిటీలు ఉన్న జంక్షన్ వద్ద మనకు చాలా బోర్డులతో చాలా పెద్ద ఎత్తున ఆ మొబైల్ గురించి వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే దాని యొక్క ఈ యాడ్ ను చేయడానికి ఏ విధంగా చేయాలి అని చూస్తే చాలా రకాలుగా చేసి ఇంతకుముందు చేసేవారు ఇప్పుడు ఏమీ లేదు ఒక ఇమేజ్ ని ఆడ్ చేసి అనుకో ఆ ఇమేజ్ ని మనం ప్రాంప్ట్ రూపంలో నాకు ఈ మొబైల్ యాడ్ అనేది ఒక సిటీ సెంటర్లో ఉండేటట్టు క్రియేట్ చేయండి అని ఇస్తే చాలు వెంటనే మనకి కావాల్సిన ఇమేజ్ ని ఇస్తుంది.

5. రియల్ వ్యూ ఆఫ్ మ్యాప్స్

మన మనం ఒక లొకేషన్ గురించి మ్యాప్స్ లో వెతకామనుకో మనకి లైన్స్ రూపంలో మ్యాపింగ్ కలర్ హ్యాట్చింగ్ రూపంలో మనకు చూపిస్తుంది. ఇప్పుడు నానో బనాను ఉపయోగించి మనకు కావాల్సిన లోకేష్ ని అడికామనుకో వెంటనే మనకు కావాల్సిన లోకేషన్ ఉదాహరణకు ఒక సముద్ర ప్రాంతం యొక్క లొకేషన్ మనం అడిగాం అనుకో మనకు కనుచూపుమేరలో కనిపిస్తున్న విధంగా ఆ యొక్క లొకేషన్ ని ఇమేజ్ రూపంలో మనకు చాలా అద్భుతంగా మనకు ఇస్తుంది.అందువల్ల ఈ రియల్ టైం వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది .

ముగింపు

లేటెస్ట్ గా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మార్పులను మనకి అవసరాలు కోసం మనం వినియోగించుకోవాలి అదే విధంగా ఇటువంటి టెక్నాలజీలను మనం ముందుకు తీసుకుని వెళ్లాలి అదేవిధంగా మంచి దానికోసం మనం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి.