నానో బనానా ప్రో, ఇదొక తిరుగులేని ఇమేజ్ జనరేషన్ మరియు ఎడిటింగ్ మోడల్.
నానో బనానా ప్రో అనేది మనం ఇంతవరకు ఎన్నడు చూడని శక్తివంతమైన ఏఐ ఇమేజ్ జనరేషన్ మరియు ఎడిటింగ్ మోడల్. అయితే ఈ మోడల్ చాలా రకాలు ఇమేజ్ లు జనరేట్ మరియు ఎడిటింగ్ చేస్తుంది. హెచ్ డి మరియు క్లారిటీ గల ఇమేజ్ లను మనకు అందిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఒకేసారి ఆరు ఫోటోలు అప్లోడ్ చేసి, ఒక ఫోటోగా కన్వర్ట్ చేస్తుంది. కేవలం కన్వర్టే కాకుండా మనకు కావలసిన విధంగా బ్యాగ్రౌండ్ ఛేంజ్ చేసుకోవచ్చు, ఆరు ఫోటోల్లో ఉన్న వ్యక్తులను వేరే వేరే ప్లేస్ లో లేదా ఒకే చోట ఉన్నట్టు మనం ఇమేజ్ను జనరేట్ చేసుకోవచ్చు. పెన్సిల్తో గీసిన స్కెచ్లను, కలర్ గ్రేడింగ్ తో 3D ఇమేజ్ లోకి మారుస్తుంది.
AI REVOLUTION
gowri sankar
11/26/20251 నిమిషాలు చదవండి


నానో బనానా ప్రో, ఇదొక తిరుగులేని ఇమేజ్ జనరేషన్ మరియు ఎడిటింగ్ మోడల్.
గూగుల్ వారు నవంబర్ 20 న గూగుల్ డీప్ మైండ్ అధికారికంగా నానో బనానా ప్రో లాంచ్ చేసింది. ఇది వారి యొక్క నూతనంగా సమకూర్చిన మరియు అత్యంత శక్తివంతమైన అడ్వాన్స్డ్ ఇమేజ్ జనరేషన్ మరియు ఎడిటింగ్ మోడల్ .గూగుల్, ఈమధ్య జెమినై 3 నీ ప్రారంభించింది. అయిన వెంటనే గూగుల్ ఈ కొత్త రిలీజ్ తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. కొందరు దీన్ని నానో బనానా 2 అని పిలుస్తున్నారు.కానీ గూగుల్ మాత్రం నానో బనానా ప్రో అని పిలవడానికి ఇష్టపడుతుంది.
నానో బనానా ప్రో అంటే ఏమిటి?
నానో బనానా ప్రో అనేది ప్రాథమికంగా జెమినై అనే యాప్ లోని వారి యొక్క టాప్ టైర్ ఇమేజ్ మోడల్ ను ఒక పరిమాణం,ఇది జెమినై యాప్ లో నానో బనానా ప్రో ఇమేజ్ అధికారికంగా నిర్మించారు.అందువల్ల ఇది ముందు లాంచ్ చేసిన నానో బనానా కంటే చాలా బలంగా పనిచేస్తుంది. ఏఐ ఇమేజ్ లతో ప్రజలు ఇప్పటికే చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. ఎలా అంటే చాలా రకాలుగా ఈ యొక్క ఇమేజ్ మోడల్ ను వినియోగించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశాలు అంటే మాకప్స్, పోస్టర్స్, లోగోలు, ప్రాజెక్టు షాట్, ఎక్స్ప్లెయిన్ర్, గ్రాఫిక్స్ స్టిల్ ట్రాన్స్ఫర్లు వంటివి మరియు ఇన్ఫో గ్రాఫిక్స్ ,ఇలా చాలా రకాలు తయారు చేయడం వలన మన యొక్క పనిని చాలా తేలిగ్గా మరియు మెరుగ్గా, క్లీన్ గా మరింత నియంత్రించే కలిగిన మరియు మరింత సులభంగా ప్రాంప్ట్ చేయగలిగేలా మార్చడానికి దీని వెనుక ఒక సాధారణమైన ఆలోచన ఉంది.
ఈమధ్య ప్రపంచం మొత్తం ఈ గూగుల్ జెమినై వారి నానో బనానా మత్తులో ఉంది. ఎలా అంటే ఎక్కడ చూసినా ఈ నానో బనానా ఫోటోలు మనం చాలా రకాలుగా చూస్తున్నాం. మన మనసులో ఉన్న ఒక ఆలోచనని, ఒక ఇమేజ్ రూపంలో జనరేట్ చేస్తుంది. అయితే మనం చాలా రకాలు ఇమేజ్ను ఈ నానో బనానా ను ఉపయోగించి జనరేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈమధ్య సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో చాలా రకాలు గల ఇమేజ్నును చూస్తూ ఉన్నాం.
ముఖ్యంగా చెప్పాలంటే మన మదిలో ఉన్న ఆలోచన ఉపయోగించే ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక నది మీద ప్రయాణం చేస్తున్నాడు పడవ సహాయంతో అనే ఒక ఊహను మనం ఇమేజ్ రూపంలో ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే ,వెంటనే మనకు ఆ ఇమేజ్ను జనరేట్ చేసి చాలా అద్భుతంగా ఇదివరకు చూడని విధంగా మనకు చాలా క్లారిటీగా, క్లీన్ గా అందిస్తుంది.
ముఖ్యంగా ఒక్కొక్క ఇమేజ్ జనరేషన్ చూస్తే దాని యొక్క క్వాలిటీ చూస్తుంటే మతిపోతుంది. అదే విధంగా ఇన్ఫో గ్రాఫిక్స్ చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది.ఎందుకంటే ఒక చాలా పెద్ద విషయాన్ని మనకు అర్థమైన విధంగా చాలా రకాల దానికి సంబంధించిన చిత్రాలను గీసి మనకు అందిస్తుంది.ఇటువంటి ఇమేజ్ జనరేషన్ ఫుల్ హెచ్ డి క్లారిటీతో మనకి చాలా త్వరగా అందిస్తుంది.
ఈ మోడల్ ను గూగుల్ వారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ మోడల్ లో మనకు ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే గూగుల్ వారు నిర్వహించిన అన్ని ప్లాట్ ఫాం లో లభిస్తుంది. ముఖ్యంగా మనకు విద్యార్థులకు మరియు సాధన వినియోగదారులకు ఇది జెమినై యాప్ లో అందుబాటులో ఉంటుంది. మనం చాలా సులభంగా జెమినై యాప్ లోకి వెళ్లి ఆ యాప్ ను ఓపెన్ చేసినట్లయితే మనకు థింక్ టోగల్ కనిపిస్తుంది. అక్కడ దాని కింద నానో బనానా ప్రో చూడవచ్చును.
7 శక్తివంతమైన నానో బనానా ప్రో ఫీచర్స్
ఇది ఒక సాధారణమైన అందమైన ఇమేజ్ సృష్టించి చాలా అద్భుతమైన మనం ఎన్నడూ చూడని ఇమేజ్ తయారుచేసి మనకు అందిస్తుంది.
1. ఖచ్చితమైన బహుళ భాష వచన రెండరింగ్
ఇది క్లీన్ ఖచ్చితమైన వివిధ రకాల భాషలు యొక్క వచనాన్ని తయారుచేస్తుంది. ఉదాహరణకు మనం ఒక టెస్ట్ లో ఉన్న లయన్ అని పదాన్ని మనం ప్రపంచంలో ఉన్న చాలా రకాల భాషల్లో హైపర్ రియల్ ఎస్టేట్ పదార్థాలతో ( మోడల్ గ్లాస్) కూడిన ఆధునిక లోగోలుగా రూపొందించవచ్చును. అలాగే ఇది మనకు చాలా పనిని తగ్గిస్తుంది .ఎలా అంటే మనం ఒక రెస్టారెంట్ మెనూ మనం ద్విభాషాలో రూపొందించాలంటే చాలా కష్టపడి వలసి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ నానో బనానా ప్రో ఉపయోగించి చాలా సులువుగా మనకు కావలసిన భాషలో మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు మనము ఒక మెనూ ద్విభాషలో తయారు చేయాలని అనుకుంటే వెంటనే మనం ఇంగ్లీషు మరియు తెలుగులో ఒక రెస్టారెంట్ యొక్క మెనూ తయారు చేయమని ప్రాంప్ట్ బాక్సులో చిన్న ప్రాంప్ట్ ఇస్తే,వెంటనే ఆ మెనూ చాలా అందంగా చిన్నచిన్న పదాలతో కూడిన ఒక అందమైన, దానికి సంబంధించిన చిత్రాలతో చాలా అద్భుతంగా మెనూను తయారుచేసి మనకి ఇస్తుంది. ఈ ఫీచర్ చాలా అద్భుతమైనది,అని మనం సందేహ పడవసరం లేదు.
2. ఆరు చిత్రాలు వరకు మిశ్రమం చేయవచ్చు
మనం ఒక ప్రాంప్ట్ బాక్సులో ఉన్న ప్లస్ సింబల్ ని నొక్కే 6చిత్రాలను అప్లోడ్ చేసి దాన్ని ఒక్క ఫోటో ఫ్రేమ్లో అమర్చమని మనం అడిగితే మనకు చాలా అద్భుతంగా ఇస్తుంది ముఖ్యంగా ఈ ఫీచర్లో చెప్పుకోవాలంటే మనం ఆరు చిత్రాలు వేరువేరుగా వ్యక్తులు యొక్క ఫోటోలు అప్లోడ్ చేస్తే వాళ్లు వేరే వేరే బట్టలు వేసుకున్నా ఉంటారు. అయితే ఆ బట్టలను ఒకే రంగులో గల బట్టలు గా మార్చుకోవచ్చును. మరియు వేరువేరు రంగులు గల దుస్తులను మార్చవచ్చును. ఇంకా చెప్పాలంటే ఆరుగురు వ్యక్తులు యొక్క ఫోటోలను మన ఒక మదిలో ఉన్న ఆలోచన అయినా ఆ వ్యక్తులు ఒక ఏరియాలో,ఒక టీ స్టాల్ వద్ద టీ తాగుతూ సంతోషంగా ఆహ్లాదకరంగా మాట్లాడుకునే విధంగా మన ఒక చిన్న ప్రాంప్ట్ ఆ వెంటనే మనకు చాలా హెచ్ డి క్లారిటీతో ఒక మంచి ఇమేజ్ జనరేట్ చేసి మనకు అందిస్తుంది.
3. డూడుల్స్ మరియు అనోటషన్స్
ఒక గ్రూపును లేదో ఒక చిత్రాన్ని మనం అప్లోడ్ చేస్తే అక్కడ మనకు చాలా రకాల రంగులతో ఉంటాయి. రంగులతో మనం ఆ చిత్రాన్ని మనకు నచ్చిన రంగులను ఎంచుకొని దానితో మనకు కావలసిన చిత్రాన్ని యాడ్ చేయాలంటే మనం ఆ రంగుల్లో గీసిన గీతల గల ఒక చిత్రాన్ని మనం చేసి ఆ తర్వాత మనం ఒక ప్రాంప్ట్ రూపంలో మనం గీసిన చిత్రాన్ని ఇమేజ్ జనరేట్ చేయమని అడిగితే అది చాలా చక్కగా మనకు ఇమేజ్ను జనరేట్ చేసి ఇస్తుంది. అయితే ఈ ఆప్షన్ చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఇది వరకు మనం ఎప్పుడు చేయని విధంగా ఎడిట్ చేసుకోవచ్చును. ఈ ఫీచర్ లో చాలా బాగా మనం చాలా రకాల ఈ రోజులను తయారు చేసుకోవచ్చును ఎలా అంటే ఒక చిత్రాన్ని మనం తీసుకొని అప్లోడ్ చేసి ఆ తర్వాత ఆ చిత్రంలో ఉన్న వ్యక్తి క్యాప్ ధరించాడు అయితే దాన్ని మీద మనం అక్కడ చాలా రకాల రంగులు ఉంటాయి వాటిని మనం ఆ క్యాప్ కి గీతల రూపంలో ఒక ఆకారం గీసాము అనుకో కుందేలు చెవులో ఆకారం గల గీత గీస్తే దానికి మనం ఒక చిన్న ప్రాముఖ్యత గీసిన గీతలను ఆకారం ఆడ్ చేయమంటే చాలా అద్భుతంగా మనకు ఏది ఎడిట్ చేసి మనకు ఇస్తుంది.
4. ఇన్ఫో గ్రాఫిక్
మన సాధారణంగా ఒక విషయాన్ని చాలా సులువుగా నేర్చుకోవాలని లేదా గుర్తుపెట్టుకోవాలన్నా మనం చాలా కష్టపడవలసి వస్తుంది. అయితే మనం ఇప్పుడు చాలా రకాలు ఆలోచించి మనకు కావలసిన అవుట్ పుట్ తీసుకొని వస్తాం. అయితే ఇలా చేయడం వలన మన యొక్క సమయం చాలా వృధా అవుతుంది. ఇప్పుడు మనకు అటువంటి సమయం వృధా కాకుండా చాలా సులువుగా మనకు గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభంగా విధమైన ఏ విషయం గురించి మనం ఇన్ఫోగ్రాఫిక్ని తయారు చేయవచ్చును. ఎలా అంటే ఇప్పుడు మన గూగుల్ వారు నానో బనానా ప్రో అనే ఒక మోడల్ విడుదల చేశారు. దానితో మనం ఇన్ఫో గ్రాఫిక్ ని చాలా సులువుగా తయారు చేయవచ్చును. ఉదాహరణకు భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ను అనే విషయం గురించి మనకు చాలా సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ఆ విషయంలో ఆ విషయం గురించి ఒక చిన్న ప్రాంప్ట్ లేదు, ఎక్కడినుంచి అయినా తెచ్చిన విషయం అయినా మనం అప్లోడ్ చేసి దాన్ని మనము ఒక ఇన్ఫో గ్రాఫిక్ లో తయారు చేయమని మనం అడిగితే ఆ చిన్న ప్రాంప్ట్ ఇస్తే వెంటనే మనకు ఇచ్చిన విషయం గురించి చాలా చక్కగా ఇన్ఫో గ్రాఫ్ ను తయారు చేసి మనకు ఇస్తుంది. ఈ ఫీచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఆశ్చర్యం గురి చేస్తుంది.
5. 2D స్కెచ్ ఇమేజ్ నుంచి 3D ఇమేజ్ గా మార్చడం
మన సాధారణంగా చిత్రలేఖనం గీసిన వాళ్ళు చాలా చక్కగా చిత్రాలను స్కెచ్ రూపంలో గీస్తారు అయితే అవి చాలా అందంగా మరియు చాలా అద్భుతంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక చేప చిత్రాన్ని మనం ఒక చిత్రలేఖనం చేస్తే అయితే ఆ గీసిన బొమ్మను మామూలుగా చాలా బాగుంటుంది చూడడానికి అయితే మనం ఒక పెన్సిల్ తో గీసిన స్కెచ్ ని మనం రంగులు వేయాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది ఎలా దానికి తగ్గట్టుకు రంగులు వేయాలని అదేవిధంగా గీచిన స్కెచ్ పాడవ్వకుండా చూసుకోవాలి ఇలా చాలా రకాలు ఇబ్బందులు మనకు మరియు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని క్షణాల్లో మనం గీసిన స్కెచ్ కి రంగులు వేయవచ్చును ఎలా అంటే గూగుల్ వారు నానో బనానా ప్రో దించడం జరిగింది దానిని ఉపయోగించి మనం రంగులు వేయవచ్చును, ఎలా అంటే మన ముందుగా ప్లస్ సింబల్ ని నొక్కి మనం గీసిన స్కెచ్ అప్లోడ్ చేసి,ఆ తర్వాత ఒక ప్రాంప్ట్ బాక్సులో మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే ,ఆ స్కెచ్ ని రంగులో లు వేయమని అంటే వెంటనే చిటికెలో, మనకు చాలా అద్భుతంగా త్రీడి ఇమేజ్ను జనరేట్ చేసి మనకు అందిస్తుంది.
6. కలర్ గ్రేడింగ్
ఈ ఫీచర్ చాలా ఎంతగా ఉంటుంది మనం ఏదైనా చిత్రాన్ని మాన్యువల్ గా లేదా డ్రాగన్ డ్రాప్ పద్ధతిలో కలర్ గ్రేడింగ్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే అటువంటి కష్టం లేని లేకుండా లేటెస్ట్ గా జెమినై నానో బనానా ప్రో అయితే మనకు అందుబాటులోకి వచ్చింది. దానిని మనం ఉపయోగించి మనం చాలా త్వరగా మరియు సులువుగా కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చును. ఉదాహరణకు మనం ఒక ఇమేజ్ను తీసుకొని మనం జమున యాప్ లో అప్లోడ్ చేస్తే ఒక గ్రూప్ ఫోటోలను తీసుకుని అందులో వెనుకున్న బ్యాక్ గ్రౌండ్ ని కలరింగ్ చేయమని మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే వెంటనే మనకు కావాల్సిన కలర్ని యాడ్ చేసి మనకు ఇస్తుంది. ఇలా చేయడం చాలా వింతగా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా సిటీలో బిల్డింగ్ కలిగిన ఇమేజ్ అప్లోడ్ చేసి కలర్ను చేంజ్ చేయమని అడిగితే వెంటనే మనకు కలర్ చేంజ్ చేసి మనకు అందిస్తుంది. కాబట్టి ఈ ఫీచర్ చాలా అద్భుతంగా ఉంటుంది.ఇలా మనం ఏ ఇమేజెస్ ను యొక్క కలర్ గ్రేడ్ చేయమని అడిగినా వెంటనే మనకు చేసి చాలా తక్కువ సమయంలో ఇస్తుంది.
7. ఆస్పెక్ట్ రేషియో
ఒక ఇమేజ్ను మనం చాలా రకాలుగా ఆస్పెక్ట్ రేషియో చూస్తాం అయితే చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు లాండ్స్కేప్ మరియు ప్రోర్ట్రైట్ ఫోటోలు ,ఇలా చాలా రకాల ఆస్పెక్ట్ రేషియో మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఎటువంటి సమయం మరియు కష్టం లేకుండా మనం కేవలం ఒక్క చిన్న ప్రాంప్ట్ ఇస్తే,మనకు కావాల్సిన ఆస్పెక్ట్ రేషియో చూస్తాం. ఉదాహరణకు నాన్నకు ఒక ఇమేజ్ యొక్క ఆస్పెక్ట్ రేషియో 9:16 అనే కొలతతో మనకే ఒక ఇమేజ్ కావాలంటే వెంటనే నానో బనానా ప్రో యాప్ లోకి వెళ్లి, మనం చిన్న ప్రాంప్ట్ ఇస్తే మనకు కావలసిన ఆస్పెక్ట్ రేషియో కలిగిన ఇమేజ్ను వెంటనే మనకు జనరేట్ చేసి ఇస్తుంది. ఇలా ఒకటి కాదు చాలా రకాలు ఆస్పెక్ట్ రేషియో 12:9,
9:13 చాలా క్రియేట్ చేయొచ్చు.
ముగింపు
అతి శక్తివంతమైన ఇమేజ్ జనరేషన్ మరియు ఎడిటింగ్ మోడల్. ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. అయితే దీన్ని ఉపయోగించి మనం మంచి అవుట్ పుట్ ను పొందొచ్చు. ఈ అవుట్ పుట్ వల్ల ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎడోబే, ఫోటోషాప్ మరియు కాన్వా, గ్రాఫిక్స్ డిజైన్లకు ఇది సవాల్ గా మారిందని మనం ఊహించవచ్చు.అదేవిధంగా ముందు ముందున ఇటువంటి గ్రాఫిక్ డిజైనర్స్ మాయమయ్యే రీతిలో, ఈ నానో బనానా ప్రో మనకు అందిస్తున్న ఔట్పుట్ ను చూస్తే మనకు అర్థమవుతుంది.
