జియో నెట్వర్క్ యూజర్లకు  బంపర్ ఆఫర్ ₹34,000/- విలువగల జెమినై యాప్ gemini 2.5 pro ప్లాన్ ను ఉచితంగా ఇస్తుంది. ఈ ఆఫర్ ను పొందాలంటే మనం జియో యాప్ లోకి వెళ్లి క్లైమ్ చేసుకోవాలి.

జెమినై యాప్ అంటే కేవలం ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ కాదు. ఎందుకంటే ఇది గూగుల్ ప్రోడక్ట్ కాబట్టి ఇది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ జెమినై యాప్ మనకు ఏ విధంగా సహాయం చేస్తుందంటే, యాప్స్ తయారు నుంచి మనకు అసిస్టెంట్ గా వ్యవహరించడం వరకు ఇంకా చెప్పాలంటే, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ ఏదైనా విషయాన్ని సుదీర్ఘంగా డీప్ రీసెర్చ్ చేయడానికి , మనం ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయాలన్న , మన యొక్క వ్యాపారాలను మెరుగుపరచుకోవడానికి , ఒక పెద్ద మొత్తంలో ఉన్న బుక్కులను కూడా ఎనలైజ్ చేసే మనకు ఖచ్చితమైన సమాచారాన్ని,చాలా తక్కువ సమయంలో ఇస్తుంది.

AI REVOLUTION

gowri sankar

11/1/20251 నిమిషాలు చదవండి

జెమినై 2.5 pro

జియో నెట్వర్క్ యూజర్లకు బంపర్ ఆఫర్ ₹34,000/- విలువగల జెమినై యాప్ ప్లాన్ ను ఉచితంగా ఇస్తుంది. ఈ ఆఫర్ ను పొందాలంటే మనం జియో యాప్ లోకి వెళ్లి క్లైమ్ చేసుకోవాలి.

ఎందుకంటే జియో అనేది ఇప్పుడు ఎవరైతే జియో నెట్వర్క్ యూజర్స్ ఉంటారు. వాళ్ళకి జియో అనేది గూగుల్ వారి యొక్క ఏఐ ఆధారితమైన జెమినై యాప్ ను మనకు అందిస్తుంది.ఏఐ చాట్ బేస్ అయిన ఒక సెర్చ్ ఇంజిన్ యాప్ ను ఉచితంగా అందిస్తుంది. అసలు జియో ఎందుకు మనకు ఉచితంగా ఇస్తుందంటే, గత ఆగస్టు నెలలో జియో మరియు గూగుల్ ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఎందుకంటే ఏఐను మనకు అందుబాటులో తీసుకురావడానికి ,ఏఐ టెక్నాలజీ మనం ఎలా ఉపయోగించుకోవాలి, మన యొక్క పనితనాన్ని ఎలా వేగవంతం చేసుకోవాలి ,మన యొక్క సమయాన్ని ఎలా కాపాడుకోవాలి ,అని విషయం భాగంగా , ఒక తరుణంలో ఈ ఏఐ విప్లవాన్ని ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్లడానికి, ఈ జియో అనేది గూగుల్ తో ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇప్పుడు జెమిని 2.5 ప్రో అనే ఏఐ మోడల్ ను జియో నెట్వర్క్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు రాబోయే 18 నెలలు వరకు ఉచితంగా ఇస్తుంది. ఎవరు దీనికి అర్హులు అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు నిండి ఉన్న యువతీ యువతులకు, జియో నెట్వర్క్ యూజర్లకు, జెమినై 2.5 ప్రో మోడల్ ను ఉచితంగా ఇస్తుంది.

ఇంతకీ ఈ జెమినై యాప్ లో ఏముంటుంది. అసలు ఎలా మనకు ఉపయోగపడుతుంది, ఎలా మనం దాన్ని వినియోగించాలి అనే విషయం గురించి చూస్తే

పరిచయం

ఈ జెమినై యాప్ అనేది ఎప్పుడు మొదలైందంటే మొదట గూగుల్ వారు ఏఐ ఆధారితమైన గూగుల్ బార్డ్ , ఇది ఒక సెర్చ్ ఇంజిన్. దీన్ని 2023 సంవత్సరంలో ప్రవేశ పెట్టారు. అయితే ఆ సంవత్సరంలో ఏఐ ఆధారిత బ్రౌజింగ్ సంబంధించిన యాప్స్ చాలా వచ్చాయి.అయితే వాటిని తట్టుకునే విధంగా గూగుల్ వారు జెమినై అనే ఒక యాప్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది 2025 లో చాలా సంచలనంగా మారింది.

ఈ యాప్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి.

1. చాట్ బేస్ క్యస్షన్ మరియు ఆన్సర్

ఇది ఒక అద్భుతమైన హార్ట్ ఎందుకంటే ఇది చాలా రకాలు ఏ ఏ చాట్ బట్టలు మనకు అందుబాటులోకి వచ్చాయి కానీ అంతకంటే ఈ జెమినీ యాప్ నిధి చాలా అద్భుతంగా పనిచేసే ఒక మోడల్ అయితే మిగతా యాప్లు గురించి చూసుకుంటే చార్జీ పెట్టి కో పైలెట్ సిటీ ఇలా చాలా చాట్ బాట్లు మనకు అందుబాటులో ఉన్నాయి అయితే వాటిని తట్టుకునే విధంగా గూగుల్ సరికొత్తగా ప్రవేశపెట్టిన జెమినీ చాట్ బాట్ ఇది చాలా ప్రత్యేకమైన ఏఐ మోడల్.

ఈ చాట్ బాట్ ఎలా పనిచేస్తుందంటే మనం జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు మనకి కావలసింది చాలా తక్కువ సమయంలో ఖచ్చితమైన సమాధానములను అందిస్తుంది. ఇది చాలా రకాలుగా మనకు సహాయపడుతుంది ఈ మెయిల్స్ రాయడం నుంచి మనం అడిగిన ప్రతిదానికి సరైన సమాధానం చాలా తక్కువ సమయంలో ఇవ్వడం జరుగుతుంది.

ఉదాహరణకు

భారతదేశంలో నేషనల్ పార్క్స్ గురించి వివరించండి. అని అడిగితే వెంటనే మనకు చాలా తక్కువ సమయంలో ఖచ్చితమైన మనం ఏదైతే అడిగాం ఆ విషయం గురించి ఇస్తుంది.

2. ఫైల్ అప్లోడ్ మరియు సమ్మరైజేషన్

ఈ మోడ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది దాని యొక్క పనితనం అనుకోవాలా అనిపిస్తుంది ఇక్కడ మనం ఒక ప్లస్ గుర్తు అనేది ఉంటుంది దాన్ని మనం ప్రెస్ చేసినట్లయితే వెంటనే మనకు ఫైల్ అప్లోడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. వెంటనే దాన్ని క్లిక్ చేస్తే మనకు కంప్యూటర్ నుంచి గాని మన మొబైల్ ఫోన్లో నుంచి గాని ఏదైనా డివైస్ నుంచి మన యొక్క పిడిఎఫ్ ఫైల్స్ ను అప్లోడ్ చేసినట్లయితే వెంటనే అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ ఏం చేసిన తర్వాత ఆ ఫైల్ లో ఉదాహరణకు మనకు అందులో ఒక 15 పేజీలు కలిగిన సమాచారం ఉందనుకో ఆ సమాచారంలో ఉన్న అతి కీలకమైన విషయాలను మనం చేయమని అడిగామనుకో వెంటనే ఆ కీలకమైన విషయాలను మనకు సమ్మరైజ్ చేసి మనకి చాలా తక్కువ సమయంలో ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తుంది.ఈ మోడ్ చాలా అద్భుతమైన మోడ్ అని మనం చెప్పుకోవచ్చు.

3. ఇమేజ్ అనాలసిస్

ఈ ఆప్షన్ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మనల్ని ఎందుకంటే మనం ఈ జెమినీ యాప్ లోకి వెళ్లినట్టు అయితే అక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది మనం ప్రెస్ చేసినట్లయితే వెంటనే మనకి ఫోటో అప్లోడ్ చేయమని ఒక చూపిస్తుంది వెంటనే మన మొబైల్లో ఉన్న లేకపోయినా కంప్యూటర్లో ఉన్న మనం ఏదైతే ఫోటో అని అప్లోడ్ చేయాలనుకున్న ఆ ఫోటో అని అప్లోడ్ చేస్తే వెంటనే దాని గురించి మనం విశ్లేషణ చేయండి, అని అడిగితే వెంటనే ఆ ఫోటో అని విశ్లేషణ చేస్తుంది.ఎలా అంటే ఉదాహరణకు మనం ఒక కార్ బొమ్మను అప్లోడ్ చేసినట్లయితే ఆ కారుని ఎనాలిసిస్ చేయండి అని అడిగామంటే వెంటనే మనకు అనాలసిస్ చేసి చాలా అద్భుతమైన సమాచారాన్ని ఇస్తుంది ఎలా అంటే ఆ కారు యొక్క రంగు ఎలా ఉంది ఏ రంగులో ఉంది. అదేవిధంగా దానికి ఏ విధంగా డిజైన్ చేశారు ఆ కారు యొక్క కంపెనీ ఏంటి , ఆ కారు యొక్క వేగం అంత ఇలా చాలా రకాలైన సమాచారాన్ని మనకి చాలా అద్భుతంగా ఇస్తుంది.

4. నానో బనానా లేదా ఇమేజ్ జనరేషన్

ఈ నానో బనానా లేదా ఇమేజ్ జనరేషన్ మోడ్ అనేది చాలా అద్భుతమైన మోడ్ ఇది మనల్ని ఒక మాయలో ఉంచుతుంది. ఎలా అంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ను తయారు చేయమని ప్రాంప్ట్ రూపంలో అడిగావనుకో వెంటనే మనం ఏదైతే ఆలోచిస్తాం. మన మనసులో ఉన్న ఒక ఇమేజ్ ని ఎలా తయారు చేయాలని ఆలోచన విధానాన్ని మనం ఒక ప్రాంప్ట్ రూపంలో ఇస్తే వెంటనే మన ఊహించుకున్న ఇమేజ్ను అది తయారుచేసి చాలా తక్కువ సమయంలో మనకి అందిస్తుంది.

ఉదాహరణకు

మన మనసులో ఒక ఇమేజ్ గురించి తయారుచేయాలని అనుకుంటాము, ఎలా అంటే ఒక వ్యక్తి గొడుగు పట్టుకొని రోడ్డు మీద వర్షంలో నడుచుకుని వస్తున్నడని, మన యొక్క మనసులో ఊహించుకున్నది. అలా తయారు చేయమని ఇమేజ్ ని అడిగావనుకో,ఒక ప్రాంప్ట్ రూపంలో మనం ఇస్తే, వెంటనే చాలా తక్కువ సమయంలో ఈ జెమినై అనేది మనకు చాలా అద్భుతమైన మన ఊహకు అందని ఇమేజ్ను జనరేట్ చేస్తుంది. చాలా ఖచ్చితంగా మరియు తక్కువ సమయంలో తయారుచేస్తుంది.

5. కాన్వాస్ మోడ్

ఈ ఆప్షన్ చాలా బాగుంటుంది, హెల్త్ లో అంటే మనం ఏదైనా విషయాన్ని తయారు చేయాలనుకున్న, ఒక విషయాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి , ఈ ఆప్షన్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు మనం ఒక ప్రణాళిక పట్టికను తయారు చేయాలనుకున్నావనుకో వెంటనే మన ఒక ప్రాంప్ట్ రూపంలో అడిగితే వెంటనే మనకు కావలసిన ప్రణాళిక పట్టికను తయారు చేసేస్తుంది.అయితే ఇందులో గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆ ప్రణాళికలో మనకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు ,అంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా మనం యాడ్ చేయాలన్న రిమూవ్ చేయాలి అన్న ఈ కాన్వాస్ మోడ్ లో ఇటువంటి వసూలు బాటు కల్పిస్తుంది. అదే విధంగా చాలా తక్కువ సమయంలో చాలా మంచి సమాచారాన్ని మనకి ఈ కాన్వాస్ మోడ్ అందిస్తుంది.

ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా ఒక సమాచారాన్ని బాగా గుర్తుంచుకోవడానికి మనం ఒక కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఆ పాయింట్స్ ని మనం ఆ సమాచారం యొక్క కీ పాయింట్స్ మనం చాలా ఈజీగా గుర్తుంచుకోవడానికి మనం ఇన్ఫో గ్రాఫ్ కూడా తయారు చేయమని అడిగితే వెంటనే మనకు ఇన్ఫో గ్రాప్ ఆఫ్ రూపంలో తయారుచేసి ఈ కాన్వాస్ మోడ్ అనేది మనకు అందిస్తుంది, అందువల్ల మన యొక్క సమయాన్ని మరియు పనిని తగ్గించడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది.

6.డీప్ రీసెర్చ్

డీప్ రీసెర్చ్ అనేది ఒక సెర్చ్ లాంటిది, మనకు అందుబాటులో ఉన్న చాలా వందలకు కొలది వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని వెతికి మనకి కావలసిన సమాచారాన్ని చాలా లోతుగా విశ్లేషణ చేసి మనకి ఏదైతే సమాచారం కావాలో ఆ సమాచారాన్ని చాలా తక్కువ సమయంలో అధ్యయనం చేసి మనకు అందిస్తుంది.

ఉదాహరణకు

పది రోజుల కేరళ ప్రయాణం గురించి మనం అడిగామంటే వెంటనే మనకు ఆ పది రోజుల గురించి సమాచారం ఇస్తుంది. ఎలా అంటే 10 రోజులకు కేరళ ప్రయాణం గురించి మనకు కొంత సమాచారం ఇస్తుంది. అయితే మనకు ఎడిట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాన్నుంచి మనకు కావాల్సిన ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఈ డీప్ రీసెర్చ్ అనే ఆప్షన్ లోకి మనం వెళ్లినట్లైతే కొన్ని వందల కొలది వెబ్సైట్లో ఉన్న లోతైన సమాచారాన్ని వెతికి మనకు చాలా తక్కువ సమయంలో మనకు కావలసిన సమాచారాన్ని ఇస్తుంది.ఈ ఫీచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్క నిమిషంలో డాక్యుమెంట్ను తయారు చేసి ఇస్తుంది .

పది రోజుల కేరళ ప్రయాణం గురించి అంతే ఎలా లోతైన సమస్యలను రీసెర్చ్ చేసేస్తుందంటే మనం కేరళ వెళ్లే ముందు కేరళ వెళ్ళిన తర్వాత మనం ఏ హోటల్ లో బసవేయాలి,ఎటువంటి ఆహారం లభిస్తుంది .అక్కడ ప్రసిద్ధిగాంచిన ఆహారం ఏంటి, ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు ఏంటి, మనం ఎక్కడెక్కడికి వెళ్లాలి.అక్కడున్న కట్టుబాటులోకి ఇలా చాలా విషయాలను మనకి లోతుగా వెతికి విశ్లేషించి చాలా వందల కొలది వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని మనకు కావలసిన ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.

7. ఫ్యాక్ట్స్ చెక్ విత్ గూగుల్ సెర్చ్

నిర్దిష్టమైన సమాచారాన్ని మనం ఈ జెమినై అడిగినట్లయితే, మనకు చాలా నమ్మకమైన అద్భుతమైన సమాచారాన్ని అందిస్తుంది.

8. యాప్

ఈ యొక్క మోడ్ లో చాలా అద్భుతమైన విషయంగా మనకి అనిపిస్తుంది ఎందుకంటే ఈ జెమిని యాప్ లో మనకు చాలా యాప్స్ ను కనెక్ట్ చేసి ఉంచుతాయి. ఎలా అంటే మనకి ఇష్టమైన యాప్స్ ని ఈ జెమినై యాప్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఉదాహరణకు మనం జిమెయిల్ గాని,గూగుల్ క్రోమ్ గాని యూట్యూబ్ గాని మనకి ఇది కనెక్ట్ అయి ఉంటాయి. వెంటనే మనం గూగుల్ గురించి గానీ జిమెయిల్ గురించి గానీ అడిగితే వెంటనే గూగుల్ తో జిమెయిల్ తో కనెక్ట్ అయి మనకి గూగుల్ లోకి వెళ్లి మనం ఏదైతే కావాలనుకుంటాం, అది మనకి అందుబాటులోకి ఉంటుంది.

9. జెమ్స్

ఈ మోడ్ లో ఇది సాధారణంగా ఈ జెమ్స్ అనేది ఒక జిపిటి లేదా ప్రాజెక్టు లాంటిది. ఇది మేనేజ్మెంట్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎలా అంటే మనం ఏదైనా విషయం గురించి తయారు చేయాలన్న ఏదైనా ప్రాజెక్ట్ సృష్టించాలైన వాటి గురించి మనం చాలా కష్టపడి అవ్వాల్సిన లేకుండా ఈ జెమ్స్ ఆప్షన్ మనకు సులువుగా చేస్తుంది. ఉదాహరణకు మనం యూట్యూబ్ లో గురించి మనం చూసుకుంటే యూట్యూబ్ టైటిల్ జనరేషన్ గురించి గానీ దాని యొక్క స్పెసిఫిక్ గా ఉన్న క్యారెక్టర్స్ గురించి మనం అడిగావంటే,వెంటనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తుంది. కాబట్టి ఈ జెమ్స్ ఆప్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది.

10. వీడియో జనరేషన్

ఈ ఆప్షన్ ను చాలా అద్భుతంగా ఉంటుంది . సాధారణంగా మనం ఒక వీడియోను తయారు చేయాలంటే చాలా కష్టపడాలి. షూట్ చేయాలి మరియు ఎడిటింగ్ ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ జెమిని యాప్ ను ఉపయోగించి మనం సింపుల్గా ఏమీ లేదు చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది.చాలా క్లారిటీగా అసలు ఇటువంటి వీడియోలు ఎన్నడు చేయనట్టు విధంగా మనకు అందిస్తుంది. ఉదాహరణకు ఒక కుర్రాడు వర్షంలో తడుచుకొని కొండల మధ్య తిరుగుతున్నాడు, అని ఒక చిన్న మనం ప్రాంప్ట్ టైప్ చేసి జెమినై ఇస్తే వెంటనే మనం ఏదైతే టైప్ చేసి ఇచ్చామో, దానిని అనుసరించి మనకు వీడియో జనరేట్ చేస్తుంది .ఆ వీడియో చాలా హై క్వాలిటీ తో, మనం ఎన్నడూ ఊహించిన విధంగా ఆ వీడియోను అందిస్తుంది.

11. నోట్ బుక్ ఎల్ ఎం

ఇది ఒక వ్యక్తిగత డాక్యుమెంట్ తయారీ లేదా నోటుబుక్కు తయారీ ఈ యొక్క మోడ్ చాలా వింతగా ఉంటుంది. ఏంటంటే మనం యూట్యూబ్ జో లో మనం వెళ్తే యూట్యూబ్ లో ఉన్న వీడియోలో ఉన్న విషయం గురించి మనకి సమాచారం చాలా అద్భుతంగా ఇస్తుంది. ఉదాహరణకు మనం యూట్యూబ్లోకి వెళ్ళిన అనుకో యూట్యూబ్లో ఏదైనా ఒక ఫైనాన్స్ గురించి సంబంధించిన వీడియో ఉంటుంది ఆ వీడియోలో ఉన్న విషయాన్ని మనం ఒక డాక్యుమెంట్ రూపంలో కావాలనుకున్న అదేవిధంగా అందులో ఉన్న కీలకమైన పాయింట్స్ గురించి కావాలన్నా అనే విషయం గురించి లేదా సమ్మరైజ్ గురించి కావాలనుకుంటే వెంటనే మనం నోట్ బుక్ ఎల్ ఎం ఆప్షన్ లోకి వెళ్తే ఆ యూట్యూబ్ యొక్క వీడియో లింక్ ని మనం ఈ నోట్ బుక్ అల్లం లో అప్లోడ్ చేసినట్లయితే వెంటనే మనకు ఒక చాట్ బాక్స్ ఉంటుంది ఆ చాట్ బాక్స్ లో ఆ వీడియో యొక్క సమ్మరైజ్ కావాలంటే వెంటనే అందులో ఉన్న కీలకమైన విషయాలు ఇస్తుంది. అదేవిధంగా వాటిని చాలా రకాలుగా మనకు ఇస్తుంది. ఎలా అంటే ఆ ఉన్న ఆ విషయాన్ని మనం క్వశ్చన్ రూపంలో మిమ్మల్ని అడిగిన లేదా క్విజ్ రూపంలో మనం అడిగిన బిట్ బ్యాంక్ తయారును అందిస్తుంది. ఈ విధంగా ఈ నోట్ బుక్ ఎల్ ఎం మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఇలా ఇంకా చాలా ఆప్షన్లో ఉన్న ఈ నోట్బుక్ ఎల్ ఎం ఇంకా చాలా ఆప్షన్స్ చాలా ఉన్నాయి.సేమ్ పద్ధతిని మనకి ఇస్తాయి.ఆప్షన్ కూడా ఏంటంటే ఏదైనా పిడిఎఫ్ ఫైల్స్ అప్లోడ్ గాని అదే విధంగా పేస్ట్ గాని అదేవిధంగా వెబ్సైట్లు యొక్క లింక్ ని గాని ఇస్తే సేమ్ పనిని మనకి కనపరిస్తుంది. ఇంకా అద్భుతమైన ఆప్షన్ ఉంది, అది ఏంటంటే ఆడియో, ఈ ఆడియో అనేది ఎలా ఉంటుందంటే మనం ఏదైతే ఒక వెబ్సైట్ లింక్ ని పేస్ట్ చేస్తాము. వెంటనే ఆ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని మనకి ఒక ఆడియో రూపంలో ఇస్తుంది. ఎలా అంటే పాడ్ క్యాస్ట్ రూపంలో మనకు ఆ యొక్క సమాచారాన్ని ఇస్తుంది. ఈ పాడ్ కాస్ట్ అనేది డిబేట్ రూపంలో మనకు అందిస్తుంది.అందువల్ల ఈ నోట్ బుక్ ఎల్ ఎం అనేది చాలా అద్భుతమైన వ్యక్తిగత డాక్యుమెంటరీ అని మనం చెప్పుకోవచ్చు.

12.మాసివ్ కాంటెక్స్ట్ విండో

ఈ ఆప్షన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఎన్నడు కని విని విధంగా ఉంటుంది.ఎందుకంటే ఈ ఆప్షన్ లో మనం చాలా ఎక్కువ పేజీలున్న ఒక పిడిఎఫ్ ను అప్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉదాహరణకు మనం 2000 పేజీలు గల పిడిఎఫ్ అప్లోడ్ చేసినట్లయితే వెంటనే చాలా తక్కువ సమయంలో మనకు కావలసిన విషయాన్ని విశ్లేషించి కావలసిన సమాచారాన్ని మనకి ఇస్తుంది. ఈ ఆప్షన్ వల్ల మన యొక్క సమయం ఆదా చేసుకోవచ్చు.

ముగింపు

ఈ జెమినై యాప్ కేవలం ఏఐ టూల్ కాదు ,దీని ద్వారా మన యొక్క జీవితాన్ని వేగవంతం చేసుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి , కాలాన్ని వృధా లేకుండా చేసుకోవడానికి, ఈ యాప్ ను మనం అసిస్టెంట్ గా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ యొక్క యాప్ ను మనం మంచి పనుల కోసం వినియోగించాలి.రాబోయే తరానికి కూడా ఇది అందించాలి.