నోట్ బుక్ LM

నోట్ బుక్ LM అనేది గూగుల్ తయారు చేసిన ఒక శక్తివంతమైన ఏఐ ఆధారిత రీసెర్చ్ వ్యక్తిగత అసిస్టెంట్. ఇది ఎలా పని చేస్తుందంటే, మనం ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన, వెంటనే ఆ డాక్యుమెంట్ లో ఉన్న విషయాన్ని మనకు ఒక సమ్మరైజ్ రూపంలో అందిస్తుంది. ఇంకా డాక్యుమెంట్ రూపంలో ఉన్న విషయాన్ని ఆడియో, వీడియో రూపంలో, మనకు ఇస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.

AI REVOLUTION

Gowri sankar

9/8/20251 నిమిషాలు చదవండి

నోట్ బుక్ LM

నోట్ బుక్ LM అనేది ఒక శక్తివంతమైన ఏఐ ఆధారిత రీసెర్చ్ వ్యక్తిగత అసిస్టెంట్.

నోట్ బుక్ LM అనేది గూగుల్ తయారు చేసిన,  ఒక శక్తివంతమైన ఏఐ ఆధారిత రీసెర్చ్ వ్యక్తిగత అసిస్టెంట్. ఇది ఎలా పని చేస్తుందంటే, మనం ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన, వెంటనే ఆ డాక్యుమెంట్ లో ఉన్న విషయాన్ని మనకు ఒక సమ్మరైజ్ రూపంలో అందిస్తుంది. ఇంకా డాక్యుమెంట్ రూపంలో ఉన్న విషయాన్ని ఆడియో, వీడియో రూపంలో, మనకు ఇస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.

మనము నోట్ బుక్ LM ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఎలా అంటే క్రియేట్ నోట్ బుక్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఆప్షన్ లోకి మనం వెళ్లినట్లయితే, మనం క్రియేట్ నోట్ బుక్ అని ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక నోట్ బుక్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనకు ఒక నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి డాక్యుమెంట్స్ అప్లోడ్ అని రెండోది యూట్యూబ్ లింక్స్ అప్లోడ్ కోసం అదేవిధంగా తర్వాత వెబ్సైట్ లింక్స్ అప్లోడ్ తర్వాత కాఫీడ్ ఫైల్స్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది.

1. పిడిఎఫ్ డాక్యుమెంట్

ఈ పిడిఎఫ్ ఆప్షన్ లో మనం దాదాపుగా 50 పిడిఎఫ్ డాక్యుమెంట్స్ ను మనం అప్లోడ్ చేసుకోవచ్చు.మనం ఏదైనా ఒక పిడిఎఫ్ ను అప్లోడ్ చేశామనుకో వెంటనే ఈ ఆప్షన్లో అయితే ముందుగా మనం ఒక పిడిఎఫ్ అప్లోడ్ చేసినట్లయితే, దాని యొక్క పిడిఎఫ్ లో ఉన్న ఏటైతే విషయం ఉంటుందో ఆ విషయం గురించి మనకు వెంటనే సమ్మరైజ్ రూపంలో మనకు అందిస్తుంది. అంటే మెయిన్ పాయింట్స్ ని మనకు ఇంటర్ ఫేసులు చూపిస్తుంది. చాలా అద్భుతమైన ఆప్షన్ గా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే చాలా బాగుంటుంది మనం ఒక డాక్యుమెంట్లో దాదాపు ఒక 30 పేజీలు ఉన్నాయి అనుకో ఆ డాక్యుమెంట్ ఉన్న ఆ పేజీలో ఉన్న మనకు ఏవైతే కీలకమైన పాయింట్లు ఉంటాయో ఆ పాయింట్లని మనకు సమ్మరైజ్ చేసి వెంటనే మనకు అందిస్తుంది. ఈ ఆప్షన్ అనేది చాలా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనం అందులోనూ ఒక ఉదాహరణకు ఒక బిజినెస్ సంబంధించిన పిడిఎఫ్ లో అప్లోడ్ చేసిన వెంటనే మనకు సమ్మరైజ్ చేసి మనకు అందిస్తుంది. అయితే మనం ఒక ఏదైనా రెస్టారెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినట్లయితే ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన వెంటనే మన యొక్క బిజినెస్ ఎంత ఎంత శాతం లో సేల్ అయింది. మన అడిగితే వెంటనే అందులోను ఒక చాటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఆ చాటింగ్ ఆప్షన్ ద్వారా మనం ఆ పిడిఎఫ్ ఫైల్ తో మన ఇంట్రాక్ట్ అవ్వచ్చు అయితే ఇందులో రెస్టారెంట్ బిజినెస్ లో ఆ ఏ ఐటమ్స్ సేల్ అయ్యి ఈరోజు. ఏది ముందు ఉన్నాయని అడిగితే వెంటనే మనకు అది కూడా ఈరోజు ఈ ఐటెం ఎక్కువ శాతం సేల్ అయింది మన రెస్టారెంట్లు లో అని ఆ విధంగా మనకు చాలా అద్భుతంగా చూపిస్తుంది. అందువల్ల మన యొక్క పని అన్నది చాలా సులభతరం అవుతుంది. ఇంకా ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనం ఏదైనా ఫైనాన్స్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినట్లయితే అందులో మనకు కావలసిన ఫైనాన్స్ యొక్క లెక్కలు మనం చాలా సులభంగా మనకు ఎటువంటి కష్టం లేకుండా సమయం వృధా అవ్వకుండా మనకు చాలా సులభంగా మన యొక్క పని అనేది అవుతుంది. అందువల్ల ఈ పర్సనల్ రీసెర్చ్ అసిస్టెంట్ చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు.

2.యూట్యూబ్

మనం యూట్యూబ్ ఆప్షన్ లో వెళ్లినట్లు అయితే మన యూట్యూబ్ యొక్క లింక్ ను మన యూట్యూబ్లోకి వెళ్లి ఆ లింకును మనకు కాపీ చేసి ఇక్కడ ఆ లింక్ ని మనం అప్లోడ్ చేసినట్లయితే ఆ యొక్క యూట్యూబ్ లో ఉన్న వీడియోలో ఉన్న ఆ విషయాన్ని అది మనకి సమ్మరైజ్ చేసి చూపిస్తుంది. ఈ ఆప్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనల్ని ఒక మైమరిపిస్తుంది. ఒక ఇదేంటి ఇంత ఇలా కూడా చేస్తుంది వెంటనే కొన్ని సెకండ్లు ఇటువంటి అవుట్ పుట్ మనకు అందిస్తుంది. అయితే ఇందులో మనకి కావాల్సిన మెయిన్ పాయింట్స్ ని అది మనకి సమ్మరైజ్ రూపంలో మనకు అందిస్తుంది. ఇటువంటి ఈ యాప్స్ ను చాలా మనకు ఎంతగా ఉంటుంది. ఇదివరకు మనం ఇప్పుడు చూడన విధంగా మనకి ఏదైనా విషయానికి కావాలంటే చాలా లోతుగా ఆలోచించే చాలా కష్టపడేవలసి వస్తుంది .వీడియో రూపంలో ఉన్న దాన్ని మనం రాయాలంటే, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ అలా కాదు వెంటనే కొన్ని సెకన్లు మనకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ ను కావాల్సిన విధంగా చాలా తక్కువ సమయంలో మనకు అందిస్తుంది.ఇంకా చెప్పాలంటే ఆ సమ్మరైజ్ పాయింట్లు యూట్యూబ్ వీడియోలో ఏది మెయిన్ పాయింట్స్ అని ఒక చాటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అందులో మనం అడగవచ్చు ఆ వీడియోలో అందులో ఉన్న విషయం గురించి మనకు పూర్తిగా కావాలి అంటే వెంటనే ఆ విషయం గురించి కూడా మనకు ఒక సపరేట్ గా అందిస్తుంది. ఇది ఈ యాప్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.

3. వెబ్సైట్

ఈ నోట్ బుక్ LM లో మరో ఆప్షన్ వెబ్సైట్ లింక్ అప్లోడింగ్ ఈ వెబ్సైట్ లింక్ అప్లోడింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఏదైనా వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ని మనం కావాలనుకుంటే వెంటనే ఆ లింక్ ని మనం ఈ నోట్ బుక్ LM లో కాపీ చేసినట్లయితే, కాఫీ చేసిన ఆ వెబ్సైట్లో ఉన్న ఆ విషయాన్ని మనకి చాలా ఈజీగా చాలా కొన్ని సెకండ్లు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనకు సమ్మరైజ్ చేసి ఇస్తుంది. ఇది చాలా వింతగా ఉంటుంది .ఎందుకంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్లి ,మనకి కావాల్సిన విషయానికి మనం ఒక విశ్లేషణ చేయాలంటే చాలా సమయం తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఇది అలా కాదు వెంటనే మనకు ఎటువంటి టైం వృధా కాకుండా మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదేవిధంగా ఇంకా చూసుకుంటే మనకు కావాల్సినయినా మెయిన్స్ పాయింట్స్ కోసం అక్కడ ఒక చాటింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆప్షన్ లో మనం చాట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా మనకు కావలసిన విషయం ఇస్తుంది. ఉదాహరణకు మనం వెబ్సైట్లో కావలసిన టాపిక్ తీసుకుంటే మనం రెస్టారెంట్ విషయం తీసుకుంటే ఆ రెస్టారెంట్లో ఒక ఫుడ్ ఐటెం ఫుడ్ ఐటమ్స్ గురించి తీసుకుంటా ఫుడ్ ఐటెం మనం తిని తర్వాత చాలా టేస్ట్ గా ఉంది ఆ ఫుడ్ గురించి చెప్తాం.ఈ ఫుడ్ చాలా బాగుంది ఇందులో చాలా రకాల ఇంగ్రిడియంట్స్ కలుపుతారు. ఈ ఫుడ్ గురించి మనం అడిగితే ,ఇది చాలా న్యాచురల్ ఫుడ్ ఇది మన కు చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్. ఈ ఫుడ్ అనేది చాలా ఆరోగ్యవంతంగా మన యొక్క శరీరానికి పనికొస్తుంది. అయితే ఇందులో మనం ఆ చాటింగ్ రూపంలో ఈ ఫుడ్ ఐటమ్ లో ఏ ఇంగ్రిడియంట్స్ ఎక్కువగా వాడుతున్నారు. అని అడిగితే వెంటనే మనకు ఒక పాయింట్స్ అనేది మనకు అందిస్తుంది. ఇందులో ఇన్ని రకాల ఇంగ్రిడియంట్స్ కలిపారు. అని చాలా చక్కగా వివరణ ఇస్తుంది. ఇటువంటి అద్భుతమైన ఫీచర్ ను మనం ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండడం అటువంటి ఫీచర్ ను కలిగి ఉంటుంది ఈ నోట్ బుక్ LM.

4. ఆడియో

మనం ఒక రెస్టారెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినట్లయితే ఈ అప్లోడ్ డాక్యుమెంట్ ,టెక్స్ట్ రూపంలో ఉన్న విషయాన్ని ఆడియో రూపంలో కు మనకు అందిస్తుంది. ఈ ఆప్షన్ చాలా బాగుంటుంది. అయితే ఆ డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ రూపంలో ఉన్న విషయాన్ని చాలా తక్కువ సమయంలో ఆడియో రూపంలో కూడా మనకి అందిస్తుంది. అయితే ఈ ఆడియో రూపం అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది . ఈ ఆప్షన్ చాలా మనకు వింతగా ఉంటుంది ఏంటి ఒక టెక్స్ట్ రూపంలో ఉన్న విషయాన్ని మనకు ఆడియో రూపంలో అందించిన చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఆడియో రూపంలో కావాలంటే , మనం చాలా ఎడిటింగ్ కోసం చాలా కష్టపడి చేసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఈ ఆప్షన్ బాగుంటుంది ఎందుకంటే కొందరికి ఆడియో రూపంలో కావాలని అనిపిస్తుంది . ఈ ఆడియో రూపంలో కూడా మనం చాట్ ఆప్షన్ లోకి వెళ్లి ఆ ఆడియో లో ఉన్న కీలకమైన విషయాలను అడిగితే వెంటనే మనకు ఆడియో రూపంలో మనకు అందిస్తుంది. ఇంకా చెప్పాలంటే అందులో ఒక రెస్టారెంట్ విషయానికి వెళ్ళామనుకో , ఈరోజు ఏ ఐటమ్స్ ఎక్కువ శాతం సేల్ అయ్యాయి, అనే విషయాన్ని అడిగితే వెంటనే మనకు ఒక వరుస క్రమంలో అందిస్తుంది. ఈ ఐటెం చాలా ఎక్కువ సేల్ అయిందని మొదటి స్థానం, రెండు స్థానాలు, ఇలా స్థానాల గురించి కూడా మనకు చెప్పడం జరుగుతుంది.ఇటువంటి అద్భుతమైన ఈ నోట్ బుక్LM ఇలా మనకు అందుబాటులోకి రావడం జరిగింది.

5. వీడియో

ఈ వీడియో ఆప్షన్ ఇది చాలా నమ్మశక్యమైనది ఆప్షన్ గా మనం భావించవచ్చు ఎందుకంటే మనం ఏదైనా డాక్యుమెంట్ను అప్లోడ్ చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్ అన్నది నోట్ బుక్LM అన్నది ఒక టెక్స్ రూపంలో ఉన్న ఫైల్ ని ఆడియో రూపంలో కన్వర్ట్ చేస్తుంది. వీడియో రూపంలోకి కన్వెర్ట్ చేస్తుంది. అయితే ఈ వీడియో రూపమైనది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇంతవరకు కనివిని ఎరగని రూపం లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని వీడియో రూపంలో అందిస్తుంది.ఆ డాక్యుమెంట్లు లో ఉన్న ఏదైనా ఒక స్టోరీగా రాసిన ఆ స్టోరీని మనం టెక్స్ట్, వీడియో రూపంలో అందిస్తుంది. కాబట్టి మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలన్న చాలా ఈజీగా మనం ఈ వీడియో ఆప్షన్ అన్నది చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి ఎడిటింగ్ అవసరం లేదు ఎటువంటి క్రియేటింగ్ కూడా అవసరం లేకుండా మనకి ఈ వీడియో ఆప్షన్ చాలా బాగుంటుంది. ఉదాహరణకు మనం ఏదైనా స్టోరీ రాసి దాన్ని మనం వీడియో రూపంలో మనం బయటికి తీసుకు రావాలంటే చాలా కష్టతరమవుతుంది. చాలా ఎడిటింగ్లు చాలా క్యారెక్టర్లు చాలా వాటిల్ని మనం క్రియేట్ చేయాలి. మనకు చాలా ఈజీ అవుతుంది. చాలా రకాల వెబ్సైట్లు మనకు అందుబాటులో వచ్చాయి టెక్స్ట్ వీడియో అని కానీ ఇక్కడ నోట్బుక్ ఎల్ ఎం లో చాలా బాగుంటుంది. మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలంటే జస్ట్ మనం ఆప్షన్ లోకి వెళ్లి మనం మనకు ఆడియో రూపంలో, వీడియో రూపంలో కావాలని అంటే చాటింగ్ లో వెంటనే మనకు అది ఇస్తుంది. అదేవిధంగా దాని యొక్క సమ్మరైజ్ వీడియో రూపంలో ఇస్తుంది. అయితే ఈ ఆప్షన్ వలన మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ చాలా సులువుగా మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

6.Podcast

అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు టెక్స్ట్ రూపంలో ఉన్న విషయాన్ని ఆడి రూపంలోకి మనకు మారుస్తుంది ఈ విషయాన్ని ఒక పాడ్ క్యాస్ట్ రూపంలో మనకు అందిస్తుంది.ఎలా అంటే ఈ విషయం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఏదైనా పాడ్ క్యాస్ట్ చూసినట్లుగా , విన్నట్టుగా అనిపిస్తుంది.అక్కడ చాటింగ్ ఆప్షన్ లో వెళ్లి మనం అ పాడ్ క్యాస్ట్ లో మనం ఇంట్రాక్ట్ అవ్వచ్చు. ఇటువంటి అద్భుతమైన ఫీచర్ ని మనం ఇంతవరకు ఇంతకుముందు మనం ఎప్పుడు చూడని విధంగా చాలా వింతగా అనిపిస్తుంది.

ఉపయోగాలు

1.విద్యార్థులు

ఈ నోట్ బుక్ LM చాలా రంగాల్లో,చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా ఈ నోట్ బుక్ ఎల్ ఎం గురించి చెప్పుకుంటే విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులకు ఏదైనా అసైన్మెంట్లు గానీ, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లు గాని, హోం వర్క్ గాని చేయాలనుకుంటే, మనం ఏదైనా డాక్యుమెంటల్ రూపంలో ఉన్న దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలన్న ఎనలైజ్ చేయాలన్న, అర్థం చేసుకోవాలన్న ,చాలా టైం పడుకున్న అయితే ఈ నోట్ బుక్ ఎల్ ఎం ను ఉపయోగించుకొని మనకు యొక్క కావలసిన విషయాన్ని చాలా సులువుగా తెలుసుకోవచ్చు.

2. ఉపాధ్యాయులు

ఈ నోట్ బుక్ ఎల్ ఎం చాలా బాగా ఉపాధ్యాయుల కోసం ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఉపాధ్యాయులు ఏదైనా విషయాన్ని, విద్యార్థుల కోసం ఏదైనా టాపిక్ ఇచ్చి దాని గురించి క్వశ్చన్ లు తయారు చేయాలనుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదే విధంగా ఎగ్జామ్స్ పేపర్స్ కూడా ఈజీగా తయారు చేయొచ్చు. నిజానికి google వారు ఈ నోట్ బుక్LM టీచర్స్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుందని, వాళ్ళు చాలా గట్టిగా చెప్పడం జరిగింది.

ముగింపు.

ఈ నోట్ బుక్ LM మనం ఉపయోగించుకొని మన యొక్క అవసరాలను చాలా సులభంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇటువంటి టెక్నాలజీని నిరంతరం మన పని కోసం ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలి. అదేవిధంగా భావితరాలకు ఇటువంటి టెక్నాలజీని మనం అందివ్వాలి.